తెలుగు ప్రేక్షకులకు ఒకప్పటి అగ్ర హీరో శోభన్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అప్పట్లో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగిన శోభన్ బాబు ఆ రోజుల్లోనే చిత్ర పరిశ్రమలో అత్యధిక లేడీ అభిమానులను సంపాదించుకున్న హీరో. ముఖ్యంగా టాలీవుడ్ లో కుటుంబ కథా సినిమాలు అన్నా, ఇద్దరు భార్యలు ఉండే సినిమాలన్నా ముందుగా గుర్తుకు వచ్చే పేరు శోభన్ బాబు అని అనడంలో సందేహం లేదు. తన సినిమాలలో తన హీరోయిజంతో, అందంతో నటనతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసేవారు.
ఎప్పుడూ తాను నవ్వుతూ తన చుట్టూ ఉన్న వారిని కూడా నవ్విస్తూ ఉండే శోభన్ బాబుకు కోపం చాలా అరుదుగా వచ్చేది. ఆయనకు కోపం వచ్చిందంటే అవతవాల వారి పని అయిపోయినట్టే..! అలా ఒకసారి ఓ హీరోయిన్ విషయంలో కోపంతో రగిలిపోయిన శోభన్ బాబు ఆమెపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారట. ఆ హీరోయిన్ మరి ఎవరో కాదు సీనియర్ హీరోయిన్ నగ్మా. అప్పట్లో నగ్మా కూడా స్టార్ హీరోలతో ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది.
అదే సమయంలో శోభన్ బాబుతో కలిసి అడవి దొర అనే సినిమాలో నటించింది నగ్మా. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా సురభి కూడా నటించింది. ఈ సినిమా షూటింగ్ కోసం ఈ సినిమా యూనిట్ అంతా చెన్నై కు వెళ్లారు. షూటింగ్స్ స్పాట్ కు అందరూ వచ్చినా నగ్మా సెట్ కి రాలేదట. అరగంటకు పైగా నగ్మా కోసం ఎదురుచూసిన ఆమె షూటింగ్ కి రాలేదు. శోభన్ బాబు కూడా ఆమె కోసం ఎంతో సహనంగా ఎదురు చూశారు. దాదాపు గంటన్నర తర్వాత నగ్మా షూటింగ్ కు వచ్చింది.
ఆ సమయంలో శోభన్ బాబు ఎందుకు లేటుగా వచ్చావని ఆమెను అడగగా శోభన్ బాబుతో తలతిక్క సమాధానం చెప్పడంతో ఒక్కసారిగా శోభన్ బాబు ఆమెపై కోపంతో విరుచుకుపడ్డారట. నగ్మాను దగ్గరికి పిలిచి నీ ఆస్తి విలువ ఎంత ఉంటుందని అడగగా దానికి నగ్మా సమాధానం చెప్పడంతో నా బాత్రూం విలువ చెయ్యదు నీ ఆస్తి.. ఆర్టిస్ట్ కి క్రమశిక్షణ చాలా ముఖ్యమని గట్టిగా ఆమెకు చెప్పారు. ఆ తర్వాత శోభన్ బాబు గురించి వేరే వాళ్ళని అడిగి తెలుసుకుని నగ్మా షాక్ అయ్యారట.