సల్మాన్ నన్ను కొట్టేవాడు.. అతడో శాడిస్ట్..మాజీ గర్ల్ ఫ్రెండ్ షాకింగ్ కామెంట్స్..!

ఇప్పటికి యాభై ఆరేళ్ల వయసు వచ్చినా బ్యాచిలర్ గానే ఉండి పోయాడు.. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్. అతని జీవితంలో పెళ్లి అనే పదం లేకపోయినా గర్ల్ ఫ్రెండ్స్ మాత్రం చాలామంది ఉన్నారు. ఇప్పటికే 10 నుంచి 15 మంది గర్ల్ ఫ్రెండ్స్ అతడి లైఫ్ లో ఉన్నారు. వివాదాలకు మారుపేరు గా పేరు తెచ్చుకున్న సల్మాన్ ఖాన్ ఏ గర్ల్ ఫ్రెండ్ ను పెళ్లి పీటల వరకు తీసుకెళ్లలేకపోయాడు.

షాహేన్ జాఫ్రెయ్ దగ్గర నుంచి సోనాక్షి సిన్హా వరకు చాలామంది సల్మాన్ ఖాన్ లైఫ్ లో ఉన్నారు. ఇక ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ తో కొన్నేళ్ల పాటు సల్మాన్ ఖాన్ ప్రేమాయణం నడిపాడు. ఆ తర్వాత ఒక సందర్భంలో ఐశ్వర్య రాయ్ ని సల్మాన్ ఖాన్ తీవ్రంగా కొట్టడానే వార్తలు బయటకు వచ్చాయి. ఆ తర్వాత వారిద్దరూ విడిపోయారు. కత్రినా కైఫ్ తో కూడా కొన్నేళ్లపాటు సల్మాన్ ఖాన్ ప్రేమాయణం కొనసాగించాడు. ఆ తర్వాత ఆమె తో కూడా విడిపోయాడు.

ఇదిలా ఉండగా సల్మాన్ మాజీ ప్రేయసి అయిన సోమీ అలీ తాజాగా సల్మాన్ ఖాన్ పై తీవ్ర ఆరోపణలు చేసింది. ‘ సల్మాన్ ఖాన్ నాతో పాటు ఇతర మహిళలను కొట్టేవాడు. అతడి గురించి గొప్పగా పొగడటం, కీర్తించడం మానేయండి. అతడొక శాడిస్ట్.’ అని కామెంట్స్ చేసింది. సల్మాన్ ఖాన్ పై సోమీ అలీ చేసిన తీవ్ర ఆరోపణలు ప్రస్తుతం బాలీవుడ్ లో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి.

Tags: BOLLYWOOD ACTOR, bollywood heros, bollyywood news, Salman Khan