నలభై ఏళ్లు వచ్చినా చెక్కు చెదరని అందంలో హీరోయిన్ త్రిష ప్రేక్షకులను అవాక్కయ్యేలా చేస్తోంది. రీసెంట్ గా త్రిష లుక్ చూసి ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. పదిహేనేళ్లకు పైగానే ఈ అమ్మడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రానిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో పోకిరి, అతడు, పౌర్ణమి, వర్షం లాంటి సినిమాలు త్రిషకు ఎంతో క్రేజ్ ను సంపాదించి పెట్టాయి. ఈ ముద్దుగుమ్మ దాదాపు టాలీవుడ్ లోని స్టార్ లు అందరితోనూ సినిమాలు చేసింది.
మొదట యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన త్రిష ఈ రేంజ్ లో ఇండస్ట్రీలో ఎదగటం నిజంగా గ్రేట్. ఇక తెలుగులోనే కాకుండా తమిళ చిత్రపరిశ్రమలోనూ త్రిష స్టార్ గా రానిస్తోంది. చివరగా త్రిష 96 సినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకుంది. విజయ్ సేతపతికి ఈ సినిమాలో జోడీ కట్టగా తన అందం మరియు నటనతో మెప్పించింది. ఇక ప్రస్తుతం సీనియర్ హీరోలతో త్రిష జోడీ కడుతోంది. ఇక సినిమాలే కాకుండా త్రిష ఎఫైర్ లతోనూ తరచూ వార్తల్లో హాట్ టాపిక్ గా నిలుస్తోంది. త్రిష నలభై ఏళ్లు వచ్చినా సింగిల్ లైఫ్ ను గడిపేస్తున్న సంగతి తెలిసిందే.
అయితే గతంలో త్రిష హీరో రానాతో ప్రేమాయణం నడిపించింది. ఇద్దరూ కలిసి పార్టీలు పబ్ లకు తిరిగారు. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని అంతా అనుకున్నారు కానీ ఆ తరవాత ఇద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. అంతే కాకుండా హీరోయిన్ త్రిష హీరో ధనుష్ తో కూడా లవ్ ఎఫైర్ నడిపించింది. త్రిష ధనుష్ ల ప్రైవేట్ ఫోటోలు సైతం అప్పట్లో నెట్టింట వైరల్ అయ్యాయి. దాంతో ఇద్దరి ఎఫైర్ పై అప్పట్లో మీడియా కోడై కూసింది.
అయితే ఇప్పుడంటే ధనుష్ తన భార్యకు విడాకులు ఇచ్చాడు కానీ అప్పుడు కలిసే ఉన్నాడు. దాంతో ధనుష్ భార్య ఐశ్వర్య త్రిష పై ఫైర్ అయ్యారట. ధనుష్ పై సైతం ఐశ్వర్య సీరియస్ అయ్యారట. ఈ నేపథ్యంలోనే ధనుష్ త్రిషను దూరం పెట్టాడు. అలా ఇద్దరూ విడిపోవాల్సి వచ్చింది.