టీమిండియా స్టార్ క్రికెటర్ దినేష్ కార్తీక్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. టీమిండియా వికెట్ కీపర్‌గా అలాగే స్టార్ క్రికెటర్‌గా భారత క్రికెట్ జట్టుకు ఎన్నో సేవలు అందించాడు దినేష్ కార్తీక్. మొన్న జరిగిన ఐపిఎల్ 2023 టోర్నీలో చాలా దారుణంగా విఫలమయ్యాడు దినేష్. ఇక దీంతో దినేష్ కార్తీక్ ప్రపంచ క్రికెట్ తో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు కూడా గుడ్ బాయ్ చెప్పేందుకు రెడీగా ఉన్నాడు. అయితే భారత క్రికెట్ జట్టుకు ఎన్నో గొప్ప విజయాలు అందించిన దినేష్ కార్తీక్ జీవితంలో మాత్రం ఎవరు ఊహించని ఎంతో ఆవేదన ఉంది.
దినేష్ కార్తీక్ మొదటి భార్య.. ఆయనను ఎంతో దూరంగా మోసం చేసి.. దినేష్ స్నేహితుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇక దీంతో దినేష్ కార్తీక్ తన భార్యకు విడాకులు ఇచ్చేసి రెండో పెళ్లి చేసుకున్నాడు. 2007లో దినేష్ కార్తీక్ తన చిన్ననాటి స్నేహితురాలు అయిన నిఖిత వంజరను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరూ రెండు సంవత్సరాల పాటు ఎంతో ఆనందంగా ఉన్నారు. కానీ అదే సమయంలో దినేష్ కార్తీక్ టీమిండియా మాజీ ప్లేయర్ మురళి విజయ్ ఎంతో మంచి స్నేహితులు. తరచూ దినేష్ ఇంటికి మురళి విజయ్ వచ్చి వెళ్లేవాడు.
ఇక ఈ సమయంలోనే దినేష్ కార్తీక్ భార్యకు ఎంతో దగ్గర అయ్యాడు మురళి విజయ్. అంతే కాకుండా వీరి మధ్య అక్రమ సంబంధం కూడా ఏర్పడింది. ఈ విషయం దినేష్ కార్తీక్ తెలియడంతో నిఖితకు ఆయన విడాకులు చేశాడు. ఆ తర్వాత 2017వ సంవత్సరంలో భారత స్క్వాష్ ప్లేయర్ దీపికాను ప్రేమించి పెళ్లి చేసుకుని ఎంతో ఆనందంగా ఉంటున్నాడు. ఇక ఇప్పుడు అచ్చం దినేష్ కార్తీక్ లాగానే, శ్రీలంక మాజీ ఆటగాడు దిల్షాన్, ఆస్ట్రేలియా మాజీ స్పీడ్ బౌలర్ బ్రెట్ లీ కూడా వారి భార్యల చేతిలో దారుణంగా మోసపోయారు.
శ్రీలంక మాజీ ప్లేయర్ దిల్షాన్.. నిరంకా వితంగే అనే మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దిల్షాన్ భార్య మాత్రం రహస్యంగా మరో శ్రీలంక ఆటగాడు ఉపుల్ తరంగాతో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసిన దిల్షాన్ అమెకు విడాకులు ఇచ్చి.. తర్వాత మరో స్టార్ హీరోయిన్ పెళ్లి చేసుకున్నాడు. అతడి మొదటి భార్య ఉపుల్ తరంగను పెళ్లి చేసుకుంది. ఆస్ట్రేలియన్ స్పీడ్ బౌలర్ బ్రెట్ లీ భార్య కూడా ఓ రగ్బి ప్లేయర్‌తో అక్రమ సంబంధం పెట్టుకుంది. బ్రెట్‌లీ కూడా ఆమెకు విడాకులు ఇచ్చేసి ఇండియన్ అమ్మాయిని వివాహం చేసుకొని ప్రస్తుతం తన లైఫ్ లో హ్యాపీగా ఉన్నాడు.