హీరోయిన్ మీనా చేసిన ప‌నికి ఆగ్ర‌హంతో లాగిపెట్టి కొట్టిన అక్కినేని..?

సీతారామ‌య్య‌గారి మ‌న‌వ‌రాలు.. ఈ సినిమా ఊహ‌ల‌కు కూడా అంద‌ని విధంగా హిట్ట‌యింది. వీఎంసీ మూ వీస్ ప‌తాకంపై నిర్మాత వ‌ర‌ద‌రాజులు తీసిన ఈ సినిమా ఒక ప్ర‌యోగం. అప్ప‌ట్లో ఇది కేర‌ళ‌లో వ‌చ్చింది. దీని హ‌క్కులు కొనుక్కున్న వ‌ర‌ద‌రాజులు… న‌టుల కోసం ఎదురు చూస్తున్నారు. మొద‌ట సీతారామ‌య్య పాత్ర‌కు.. హీరో కృష్ణ‌ను అనుకున్నారు. ఆయ‌న‌తో మాట్లాడారు. ఆయ‌న కూడా ఓకే చెప్పారు.

ఒక‌టి రెండు షూటింగులు కూడా జ‌రిగాయి. కానీ, ఎందుకో తెర‌మీద చూసుకున్న కృష్ణ‌.. వ‌ద్దులే అని త‌ప్పుకొని..అ ప్ప‌టికే తీసుకున్న అడ్వాన్స్ కూడా ఇచ్చేశారు. అదే స‌మ‌యంలో అక్కినేనితో ఈ వేషం వేయించండి బాగుంటుంద‌ని ఆయ‌న స‌ల‌హా కూడా ఇచ్చారు. దీంతో విష‌యం కాస్తా అక్కినేనికి చేరింది. అయితే. ఆయ‌న కూడా.. మేక‌ప్ లేకుండా.. ముఖ్యంగా విగ్ లేకుండా న‌టించేది లేద‌ని తేల్చిచెప్పారు.

ఇదొక పెద్ద స‌మ‌స్య‌గా మారింది. మ‌ళ్లీ హీరో కృష్ణ ద‌గ్గ‌ర‌కు వ‌ర‌ద‌రాజులు వెళ్ల‌డం.. ఆయ‌న అక్కినేనికి వివ‌రించ‌డంతో మొత్తానికి ఓకే చేశారు. ఇక‌, మీనా పాత్ర‌కు ఎవ‌రిని ఎంపిక చేయాల‌నే సందేహంతో కొన్ని రోజులు గ‌డిచాయి. ముందు శ్రీదేని అనుకున్నారు. కానీ, ఆమె స‌సేమిరా అన్నార‌ట‌. దీంతో ఎవ‌రో ఇచ్చిన స‌ల‌హా మేర‌కు అప్పుడే త‌మిళంలో న‌టిస్తున్న మీనాను తీసుకువ‌చ్చారు.

అయితే.. అక్కినేనిని ముందు ఆమె కాలిపై కాలు వేసుకుని కూర్చున్నారు. ఇది చూసిన అక్కినేని నిర్మాత‌ను హెచ్చ‌రించార‌ట‌. ఆ అమ్మాయికి పెద్ద‌లంటే ఏమాత్రం భ‌య భ‌క్తులు లేన‌ట్టున్నాయి.. మీరైనా చెప్పండి అన్నార‌ట‌. దీంతో ఒక‌సారి చెప్పారు. కానీ, ఆమె విన‌లేదు. దీంతో మ‌రుస‌టి రోజు.. అక్కినేని సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చార‌ట‌.

పెద్ద‌లంటే.. భ‌యం భ‌క్తీ లేక‌పోతే… ఇండ‌స్ట్రీలో ఎద‌గ‌లేవ్ అని చెప్పార‌ట‌. అయితే.. జ‌రిగింది ఇది. కానీ, గ్యాసిప్‌ల‌లో మాత్రం అక్కినేని మీనాపై చేయి చేసుకున్నార‌ని… లాగిపెట్టి ఒక్క‌టి కొట్టారంటూ వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఆ త‌ర్వాత మీనా ఏఎన్నార్ కొడుకు నాగార్జున‌తో ప‌లు సినిమాలు చేసి హిట్లు కొట్టింది.