మ‌రోసారి చిరంజీవిని టార్గెట్ చేస్తోన్న దిల్ రాజు… ఈ సారి థియేట‌ర్లు లేకుండా కొత్త గేమ్‌…!

టాలీవుడ్‌లో థియేట‌ర్ల విష‌యంలో అగ్ర నిర్మాత‌, డిస్ట్రిబ్యూట‌ర్ దిల్ రాజుపై ఎప్పుడూ ఏదో ఒక వార్త వ‌స్తూనే ఉంటుంది. చాలా థియేట‌ర్లు దిల్ రాజు కంట్ర‌ల్లోనే ఉన్నాయ‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఆయ‌న నేరుగా న‌డిపిస్తోన్న థియేట‌ర్ల కౌంట్ పైకి త‌క్కువ‌గానే క‌నిపిస్తున్నా… ఆయ‌న జిల్లాల వారీగా కంట్రోల్ చేసే ఎగ్జిబిట‌ర్లు, డిస్ట్రిబ్యూట‌ర్లు చాలా మందే ఉన్నారంటారు.

ఇక ప్ర‌తి పెద్ద సినిమా వ‌స్తున్న‌ప్పుడు కూడా ఈ థియేట‌ర్ల గోల ఉంటూనే ఉంటోంది. అలాగే ఒకేసారి రెండు మూడు పెద్ద సినిమాలు వ‌స్తుంటే అప్పుడు కూడా త‌మ సినిమాకు స‌రైన థియేట‌ర్లు ఇవ్వ‌డం లేద‌ని చాలా మంది గ‌గ్గోలు పెడుతూ ఉంటారు. ఈ సంక్రాంతికి బాల‌య్య వీర‌సింహారెడ్డి, చిరు వాల్తేరు వీర‌య్య‌, విజ‌య్ వార‌సుడు సినిమాలు వ‌చ్చిన‌ప్పుడు కూడా ఇలాగే థియేట‌ర్ల విష‌యంలో చాలా మంది గ‌గ్గోలు పెట్టారు.

ముఖ్యంగా చిరు అభిమానులు అయితే దిల్ రాజు కావాల‌నే త‌మ హీరో సినిమాకు మంచి థియేట‌ర్లు లేకుండా చేస్తున్నారంటూ మండిప‌డ్డారు. ఇక ఇప్పుడు కూడా మ‌రోసారి చిరు సినిమాకే దిల్ రాజు మంచి థియేట‌ర్లు దొర‌క్కుండా చేస్తున్నార‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. నిఖిల్ స్పై సినిమా వ‌స్తోంది. థియేట‌ర్ల‌లో స‌రైన సినిమాలు లేవు.

ఈ క్ర‌మంలోనే వైజాగ్ ఏరియాలో దిల్ రాజు స్పై సినిమా కావాలంటే థియేట‌ర్ల‌కు ఓ కండీష‌న్ పెడుతున్నాడ‌ట‌. స్పై సినిమా ఇస్తా కానీ ర‌జ‌నీకాంత్ జైల‌ర్ సినిమా కూడా తీసుకోవాల‌న్న‌దే ఈ కండీష‌న్ అట‌. జైల‌ర్ త‌ర్వాత రోజే చిరంజీవి భోళాశంక‌ర్ సినిమా కూడా వ‌స్తోంది. ఉత్తరాంధ్ర ఏరియాకు భోళాశంకర్ పంపిణీ దిల్ రాజు ది కాదు.. అందుకే రాజు ఇప్ప‌టి నుంచే జాగ్ర‌త్త ప‌డుతున్నాడ‌ట‌.

స్పై సినిమా ఇవ్వాలంటే జైల‌ర్ సినిమాకు థియేట‌ర్లు ఇస్తామ‌ని ముందుగానే అగ్రిమెంట్లు చేస్తున్నాడ‌ట‌. అంటే మంచి థియేట‌ర్లు అన్నీ ర‌జ‌నీ జైల‌ర్ సినిమాకే వెళ్లిపోతాయి. అప్పుడు చిరు బోళాశంక‌ర్ సినిమాకు మిడిల్ రేంజ్ థియేట‌ర్లు మాత్ర‌మే దొరుకుతాయి. దీంతో మ‌రోసారి థియేట‌ర్ల వార్ త‌ప్పేలా లేదు.