2016లో శశి దర్శకత్వంలో విజయ్ ఆంటోనీ హీరోగా సట్నా టైటస్ హీరోయిన్గా బిచ్చగాడు సినిమా తెరకెక్కింది. అసలు ప్రేక్షకులలో ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్గా రికార్డ్ లు బద్ధలు కొట్టింది. మదర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో సట్నా టైటస్ తనదైన రీతిలో నటించింది. మేకప్ లేకుండా నేచురల్ గా నటిస్తూనే హోమ్లీ లుక్ తో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమా ఫస్ట్ కోలీవుడ్ లో రిలీజ్ అయి హిట్ కొట్టింది.
తర్వాత తెలుగులో రిలీజ్ అయ్యి కోలీవుడ్ కంటే ఎక్కువ కలెక్షన్స్ కొల్లగొట్టింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా బిచ్చగాడు 2 సినిమా తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఆమెకు చాలా ఛాన్సులు వచ్చాయి. అయితే ఒక చిన్న రీజన్ తో ఆ ఛాన్సులను రిజెక్ట్ చేసి అప్పటి వరకు ఒప్పుకున్న సినిమాలను మాత్రమే నటించింది సట్నా టైటస్ , ఇంతకీ సట్నా చాన్సులను రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే..? బిచ్చగాడు మూవీ డిస్ట్రిబ్యూటర్ అయిన కార్తీక్ తో లవ్ లో ఉండడమే. ఇంట్లో వీరు ఇరువురు ప్రేమను గురించి చెప్పగా వారు రిజెక్ట్ చేశారు.
దాంతో ఇద్దరు రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకున్నారు. సట్నా పేరెంట్స్ కార్తీక్ పై కంప్లైంట్ కూడా ఇచ్చారు. తర్వాత కేసు వెనక్కి తీసుకొని వాళ్లే రిలేటివ్స్ అందరి మధ్యలో గ్రాండ్ గా వివాహం చేశారు. అయితే సట్నా కార్తీక్ తో ప్రేమలో పడి వచ్చిన ఛాన్సులను రిజెక్ట్ చేసి ఆమె కెరీర్ ను నాశనం చేసుకుంది. ప్రస్తుతం సట్నా కు ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఇటివల కాలంలో తన ఫ్యామిలీతో ఉన్న మెమరీస్ షేర్ చేసుకుంటూ ఒక వీడియోను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది సట్నా. ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే సట్నా..కార్తిక్ కంటే ముందే మరికొంతమంది ప్రేమాయణాలు నడిపిందని.. జస్ట్ టైంపాస్ చేసి వాళ్లు వదిలేసారని కూడా అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి..!!
View this post on Instagram