‘ ఆదిపురుష్ ‘ వివాదం వేళ … ఎన్టీఆర్‌కు ప్ర‌భాస్ ఫ్యాన్స్ ప్ర‌శంస‌లు ( వీడియో )

పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన ఆదిపురుష్‌ సినిమాలో రావణుడిని చూపించిన విధానంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పటికి ఆ విమర్శలు తగ్గలేదు. సోషల్ మీడియాలో ఈ సినిమా టీం పై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో జూనియర్ ఎన్టీఆర్ తాను నటించిన జై లవకుశ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రావణాసురుడి గురించి చెప్పిన వీడియో ఇప్పుడు ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.

ఆ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్‌ను యాంకర్.. రావణుడి గురించి సాధారణంగా ఎవ్వరికీ తెలియని విషయాల గురించి ఏమైనా మీరు పరిశోధనలు చేశారా ? అని అడిగింది.. ఈ ప్రశ్నకు ఎన్టీఆర్.. అటువంటి గొప్ప పౌరాణికానికి గురించి పాత్రల గురించి కొంత ఇన్ఫర్మేషన్ వెతుక్కునే ప‌ని లేదు.. మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ పాడు చేయకుండా ఉంటే చాలు అని సమాధానం ఇచ్చాడు.

అదే సమయంలో రావణుడి గురించి మరింత లోతుగా తెలుసుకోవడానికి ఆనంద్ నీలకంఠ రచించిన అసుర అనే పుస్తకాన్ని చదివాను. ఆ పుస్తకంలో రామాయణం రావణుడి కోణంలో ఉంటుంది. ఇక వాస్తవానికి రావణుడు అంటే 18 లోకాలకు రారాజు, అంతేకాకుండా ఆశ్రుల చక్రవర్తి, అన్ని లోకాలకు అధిపతి అయ్యాడంటే అతనికి ఎంత ? నేర్పు ఉండాలి. శ్రీరాముడు లాంటి వ్యక్తి యుద్ధ సమయంలో రావణాసురుడు ఎదురుపడగానే అతడిని చూడగానే ఇంత గొప్ప వ్యక్తివా నువ్వు అని ఒక పద్యాన్ని అందుకున్నాడు. అలా రావణుడు యుద్ధభూమిలో నిలబడితే శత్రువు సైతం అత‌డిని పొగిడేలా ఉండాల‌ని ఎన్టీఆర్ చెప్పాడు.

తాను జై లవకుశలో రావణ పాత్ర చేసేటప్పుడు నేను కూడా ఎలా మాట్లాడాలి ? ఎంత మాట్లాడాలి అనే విషయాలు తెలుసుకున్నాను ఆ పుస్తకం నాకు ఆ క్యారెక్టర్ చేయడానికి ఎంతో సహాయపడిందని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. ఒక సినిమాలో కేవలం రావ‌ణుడి పాత్ర చేస్తున్న ఎన్టీఆర్ ఆ క్యారెక్టర్ కోసం అంత పరిశోధన చేస్తే.. ఆది పురుష్‌ లాంటి రామాయణ కథతో వచ్చిన ఈ సినిమాలో రావణుడి పాత్ర కోసం ఈ సినిమా యూనిట్ ఎంతలా ? కస‌రత్తులు చేయాలని ప్రభాస్ ఫ్యాన్స్ కూడా మండిపడుతున్నారు.

అదే సమయంలో జై లవకుశ సినిమాలో ఎన్టీఆర్ చేసిన పరిశోధన అయ‌న అభిమానులతో పాటు ప్రభాస్ అభిమానులు కూడా సోషల్ మీడియా ద్వారా మెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.