సీనియర్ హీరోయిన్ మీనా గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. అప్పట్లో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలు అందరితో కలిసి నటించింది. తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ భాషలో కూడా ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన మీనా అతి తక్కువ సమయంలోనే సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్ అయిపోయింది. విచిత్రం ఏంటంటే రజనీకాంత్ సినిమాలో బాలనటిగా చేసిన మీనా ఆ తర్వాత అదే రజనీకాంత్ పక్కన హీరోయిన్‌గా చేసింది.
ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న మీనా రీసెంట్ గానే ఆమె భర్త విద్యాసాగర్ మరణించడంతో వార్తల్లో నిలిచింది. చిన్న వయసులోనే భర్తను కోల్పోవడంతో మీనా రెండో పెళ్లి చేసుకుంటుందంటూ పలు వార్తలు కూడా వచ్చినా అవి నిజం కాదని తేలిపోయింది. ఇక మీనా తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అందులో సీతారామయ్యగారి మనవరాలు సినిమా కూడా ఒకటి.
మన సంస్కృతి, సంప్రదాయాలను, కుటుంబ విలువలను ఎంతో గొప్పగా చూపించిన ఈ సినిమా అప్పట్లోనే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా మూడు ఫిలింఫేర్ అవార్డులు, నాలుగు నంది అవార్డులు కూడా గెల్చుకుంది. ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు ఎంతో కీలకపాత్రలో నటించారు. ఆయన మనవరాలిగా మీనా నటించింది.
ముందుగా ఈ సినిమాను సూపర్ స్టార్ కృష్ణతో చేయాలని అనుకున్నారు. కృష్ణ గారు ఈ కథ తనకు బాగోదని ఏఎన్ఆర్ తో చేయమని సలహా ఇచ్చారట. అలా ఈ సినిమాలో ఏఎన్ఆర్ నటించారు. నాగేశ్వరరావు మనవరాలి పాత్ర కోసం శ్రీదేవిని తీసుకోవాలని భావించారు ఆమె నో చెప్పడంతో ఈ అవకాశం మీనాకు వచ్చింది. అయితే ఈ సినిమాలో నటించే సమయానికి మీనాకు పెద్దవారితో ఎలా ప్రవర్తించాలో తెలిసేది కాదుట. షూటింగ్స్ స్పాట్లో నాగేశ్వరరావు ముందు కాలు మీద కాలు వేసుకుని కూర్చుని ఆయన వచ్చిన ఆయనకు గౌరవం ఇచ్చేది కాదట.
దాంతో ఆమె ప్రవర్తనను గమనించిన నాగేశ్వరరావు ఆమెను కొద్దిగా మందలించారు. చిత్ర పరిశ్రమలో ఎదగాలంటే ఇలా పెద్దవారికి గౌరవం ఇవ్వకుండా గర్వం చూపిస్తే ఇండస్ట్రీలో ఎదగలేరు. ముందు నువ్వు పెద్ద వారిని ఎలా గౌరవించాలో తెలుసుకొని ఆమెను గట్టిగా మందలించారట. అయితే ఈ ఇదే విషయాన్ని అప్పట్లో నాగేశ్వరరావు మీనా చంప పగలగొట్టారు అంటూ ఓ ఫేక్ వార్తలు క్రియేట్ చేసి వైరల్ చేశారు కానీ అసలు జరిగింది మాత్రం ఇది.