ఆ సీనియర్ నటి లైఫ్‌తో ఫుట్‌బాల్ ఆడుకున్న న‌రేష్‌, జీవిత‌… అంత హెరాస్ చేశారా ?

నర్తనశాల, ప్రయత్నం, భగీరథ, భద్ర వంటి హిట్ సినిమాలలో నటించి తనకంటూ స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంది నటి పద్మా జయంతి. తాజాగా ఈ సీనియర్ నటి ఒక యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో ఆమె నరేష్ విజయ్‌కృష్ణ, జీవిత రాజశేఖర్‌ల గురించి సెన్సేషనల్ కామెంట్స్‌ చేసింది.

ఆమె మాట్లాడుతూ.. “మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సినీ ఆర్టిస్టుల సమస్యలు తీరుస్తుందని తెలిసి ఒకరోజు ఆ సంస్థ సెక్రటరీ, జనరల్ సెక్రెటరీని కలిశాను. ఆ సమయంలో నరేష్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు. జీవిత జనరల్ సెక్రటరీగా చేస్తున్నారు. నా కూతురు పెళ్లి విషయంలో సహాయం చేయాలని వారిద్దరికీ లెటర్ రాశాను. వారిలో ఒకరేమో ఆర్థిక సహాయం చేస్తామని అంటే, మరొకరు చేయనని అన్నారు. మా అసోసియేషన్ నుంచి డబ్బులు వస్తే కూతురు పెళ్లి చేయొచ్చని నేను ఎంతో ఆశ పడ్డాను. కానీ ఆ డబ్బు సాయం చేయడానికి ముందు జీవిత, నరేష్ ఇద్దరూ కూడా నా లైఫ్‌తో ఫుట్‌బాల్ ఆడుకున్నారు….”

“ఆర్థిక సహాయం చేయాలంటే ముందుగా తాము చెప్పినట్లు చేయాలని వారు నన్ను బలవంతం చేసేవారు. మెగాస్టార్ చిరంజీవిని తిడుతూ ఒక లెటర్ రాయాలని కూడా వారు నన్ను ఇబ్బంది పెట్టేవారు. ఆ పని చేయలేక రాజీవ్ కనకాల గారిని కలిసాను. ఆయన మా అసోసియేషన్ సెక్రటరీకి, జనరల్ సెక్రెటరీకి ఫేవరబుల్‌గా ఉంటేనే పనులవుతాయని చెప్పారు. అదే సమయంలో నా కూతురు పెళ్లి కోసం రూ.1 లక్షా 116 చెక్ ప్రిపేర్ చేశారని తెలిసింది.

దాంతో సంతోషించాను కానీ జీవిత దానిపై సంతకం పెట్టకుండా తాను విదేశాలకు వెళ్లానని తెలిపారు. దాంతోనే నిరాశ పడ్డాను. చివరికి కృష్ణంరాజు ఆ డబ్బును నాకు అందించి నా బిడ్డకి పెళ్లి చేయడంలో సహాయపడ్డారు. ఈ డబ్బులు అందిన తర్వాత కూడా నీ బతుక్కి లక్ష అవసరమా అని చాలామంది మా అసోసియేషన్ లోని సభ్యులు అవమానించారు. ఆ విషయం ఎంతో బాధించింది” అని ఆమె తెలిపింది.