ఎన్టీఆర్ హీరోయిన్ గ‌జాలా… ఆ హీరో ప్రేమ‌కోసం ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసిందా.. ఆ రోజు రాత్రి ఏం జ‌రిగింది ?

అందం, అభినయం ఉన్నా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా పరిచయమై స్టార్‌డం సంపాదించుకోవడం చాలా కష్టం. స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న తరువాత కూడా హీరోయిన్లకి ఆ క్రేజ్ ఎంత కాలం ఉంటుందో చెప్పలేం. అలా ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్‌ల‌లో గజాల ఒకరు. 2001లో ‘ నాలో ఉన్న ప్రేమ ‘ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన గజాల తరువాత జూనియర్ ఎన్టీఆర్ తో స్టూడెంట్ నెంబ‌ర్ 1 – అల్లరి రాముడు సినిమాలో నటించింది.

ఈ సినిమా హిట్ కావడంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత స్టూడెంట్ నెంబర్ 1, కలుసుకోవాలని, ఓ చిన్నదాన, తొట్టి గ్యాంగ్, భారత సింహారెడ్డి వంటి ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా మారింది. కెరియర్ మంచి ఫామ్ లో ఉన్న టైంలోనే ఆమె చేసిన చిన్న పొరపాటు కారణంగా ఆమె సినీ కెరియర్ నాశనం అయ్యింది.

అప్పట్లో ఓ హీరోని ప్రేమించిన గజాల అతడికి ప్రేమను ఎలా చెప్పాలో తెలియక ఆత్మహత్య ప్రయత్నం చేసింద‌న్న రూమ‌ర్లు వినిపించాయి. అదృష్టవశాత్తు గజాల బ్రతికినా తర్వాత ఆమె న‌టించిన సినిమాలు స‌క్స‌స్ కాక ఇండ‌స్ట్రికి దూర‌మైంది. ఇంతకీ గజాల ప్రేమించిన ఆ హీరో ఎవరో? ఒకసారి చూద్దాం. గజాలా అప్ప‌ట్లో హీరో అర్జున్‌ని ప్రేమించిందట.

కానీ అతడికి త‌న ప్రేమను ఎలా చెప్పాలో తెలియక చెప్పే ధైర్యం లేక ఓ రాత్రి అర్జున్ కు ఫోన్ చేసి నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను అని చెప్పి కాల్ కట్ చేసి స్లీపింగ్ పిల్స్ మింగేసింద‌ట‌. కొంతసేపటికి అక్కడికి వచ్చిన హీరో అర్జున్ హాస్పిటల్ కి తీసుకువెళ్ల‌గా గజాల బ్రతికింది. అదే టైంలో తన ప్రేమని అర్జున్‌తో చెప్పేసిందట గజాల. నాకు పెళ్లై చాలా కాలమైంది.. నామీద నువ్వు అలాంటి అభిప్రాయంతో ఉంటే మార్చుకో అని చెప్పేశాడ‌ట‌.

ఆ తర్వాత కొంతకాలం డిప్రెషన్ లో ఉన్న గజాల తర్వాత ఆడపాదడప‌ సినిమాలు న‌టించినా అవి అంతగా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత మస్కట్‌లో తండ్రి వ్యాపారంలో ఇంటీరియర్ డిజైనర్ గా పనిచేసింది. 2016లో బాలీవుడ్ సీరియల్ యాక్టర్ ఫైసల్ రజా ఖాన్ ను వివాహం చేసుకున్న గ‌జాల వైవాహిక జీవితాన్ని గ‌డుపుతుంది.