50 ఏళ్ల వ‌య‌స్సులోనూ న‌డుం ఊపుతో డ్యాన్సుతో దుమ్ము రేపుతోన్న బాల‌య్య హీరోయిన్ ( వీడియో)

సిమ్రాన్ ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించి కొంతకాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. డైరెక్టర్ శరత్ దర్శకత్వంలో తెర‌కెక్కిన అబ్బాయిగారి పెళ్లి సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన సిమ్రాన్ తెలుగు లో బాలయ్య సరసన సమరసింహారెడ్డి, న‌ర‌సింహానాయుడు, సీమ‌సింహం, ఒక్కమగాడు, గొప్పింటి అల్లుడు లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది.

తమిళ్, హిందీ, మలయాళ భాషల్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. 1999 నుంచి 2004 వరకు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా మంచి ఫామ్ లో దూసుకుపోయింది. అందం, అభినయంతో పాటు హీరోకు ఏమాత్రం తగ్గకుండా డాన్స్ స్టెప్పులు వేస్తూ ఇరగదీసేది సిమ్రాన్. వై.వీ.య‌స్ చౌదరి డైరెక్షన్ లో తెరకెక్కిన సీతయ్యలో సిమ్రాన్ గ్లామర్ లుక్ వేరే రేంజ్ లో ఉంటుంది.

ఈ సినిమా తర్వాత అంతగా అవకాశాలు రాక‌పోవడంతో అడపాదడపా సినిమాలో హీరోయిన్‌గా నటిస్తూ మెల్ల‌మెల్ల‌గా ఇండస్ట్రీకి దూరమైంది. ఆ త‌ర్వాత పెళ్లి, ఫ్యామిలీ లైఫ్‌లో బిజీ అయిపోయింది. 50 ఏళ్ల వయసు మీద పడుతున్నా సిమ్రాన్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోషూట్స్ పోస్ట్ చేస్తూ అభిమానులను ఎంట‌ర్టైన్ చేస్తూ ఉంటుంది.

తాజాగా తమన్నా డాన్స్ చేసిన ఓ పాటకు మాస్ స్టెప్పులతో అదరగొట్టింది సిమ్రాన్. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోని చూసిన సిమ్రాన్ ఫ్యాన్స్ తమన్నా డాన్స్ మర్చిపోయేంతలా మీరు డాన్స్ అదరగొట్టారని.. ఈ వయసులోనూ దుమ్ము దులిపేలా డ్యాన్స్ చేశారంటూ.. డ్యాన్స్ లో మీకు మీరే సాటి అంటూ.. ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.