‘సరిలేరు నీకెవ్వరూ ‘ 6 డేస్ కలెక్షన్స్

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా.. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం `సరిలేరు నీకెవ్వరు`. రష్మిక మందాన హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రంలో లేడి అబితాబ్, సూప‌ర్ స్టార్ విజయశాంతి దాదాపు 13 ఏళ్ల త‌ర్వాత ఈ సినిమాలో ముఖ్య ప్రాత వ‌హించారు. ఈ సినిమాను దిల్‌ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జీ మహేష్ బాబు ఎంటర్‌టైన్మెంట్స్‌, ఏకే ఎంటర్‌టైన్మెంట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిచారు. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 11న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

భరత్ అనే నేను, మహర్షి వంటి హిట్స్ తర్వాత మహేశ్‌ నటిస్తున్న సినిమా కావడం.. పటాస్ నుంచి ఎఫ్2 వరకు కమర్షియల్ పంథాలో సినిమాలు తీస్తూ హిట్స్ ఇస్తున్న అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయడం.. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా టీజర్‌, ట్రైలర్, పాటలు ఆకట్టుకోవడం.. సంక్రాంతి సీజన్‌లో వస్తుండటంతో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక విడుద‌లైన మొద‌టి రోజు నుంచి హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. మ‌రోవైపు పండగ జోష్ చూపిస్తూ సంక్రాంతి బరిలో నిలిచి సక్సెస్ అయ్యి క‌లెక్ష‌న్స్ ప‌రంగా రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది.

ఇక‌ కొన్ని ఏరియాల్లో ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డ్స్ నమోదు చేస్తోంది. ఈ సంక్రాంతికి బ్లాక్‌బ‌స్ట‌ర్ కా బాప్ అనిపించుకుంది స‌రిలేరు నీకెవ్వ‌రు మూవీ. మ‌రియు క‌నుమ రోజు ఈ చిత్రం క‌లెక్ష‌న్స్ ప‌రంగా ఇర‌గ‌దీసింది. అలాగే నైజాం లో ఈ చిత్రం ఆరు రోజులకు 25.65 కోట్ల షేర్ రాబట్టింది. వీకెండ్ ముగిసేనాటికి మహేష్ కెరీర్ లో హైయెస్ట్ నైజాం కలెక్షన్స్ సాధించిన మహర్షి మూవీని దాటివేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక సీడెడ్ లో 11.35 కోట్లు, గుంటూరులో 7.72 కోట్లు, కృష్ణ 6.27 కోట్ల షేర్ వసూలు చేసింది. కొన్ని ఏరియాలో సరిలేరు నీకెవ్వరు బ్రేక్ ఈవెన్ కి చేరుకుంది.

ప్రాంతాల వారీగా ఏపీ/తెలంగాణా కలెక్షన్స్ వివరాలు…

నైజాం- 25.65 కోట్లు

సీడెడ్- 11.35 కోట్లు

ఉత్తరాంధ్ర- 11.08 కోట్లు

గుంటూరు- 7.72 కోట్లు

ఈస్ట్- 7.23 కోట్లు

వెస్ట్- 5.06 కోట్లు

కృష్ణ- 6.27 కోట్లు

నెల్లూరు- 2.86 కోట్లు
—————————————————————
మొత్తం ఐదు రోజులకు- రూ. 77.94 కోట్ల షేర్
—————————————————————

Tags: 6Days Collections, MaheshBabu, Sarileru Neekevvaru, Tollywood