ఆ హీరో ఏడుస్తుంటే ..ఆడియన్స్ నవ్వుకుంటున్నారు !

చేతిలో డబ్బు ఉంటేనే హీరో అవ్వడం సులువు అని చాలామంది అనుకుంటారు. కానీ ప్రేక్షకులు టాలెంట్ కోసమే చూస్తారు తప్ప మరేమీ కాదు. ఇది చాలాసార్లు రుజువైంది.తాజాగా శరవణన్ అరుల్ అనే 52 ఏళ్ల వ్యాపారవేత్త హీరోగా సినిమా చేసాడు. మోడల్ మరియు నటుడిగా పాపులర్ అయిన అతను ఇప్పుడు ‘ది లెజెండ్’సినిమాతో వచ్చాడు. ఈ సినిమా బడ్జెట్ చాలా ఎక్కువ కావడంతో ఇప్పుడు నెటిజన్స్ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

అతని లుక్స్ మరియు పెర్ఫార్మెన్స్ ట్రోల్ చేయబడే వీడియో వైరల్ అవుతోంది. ఎమోషనల్ సీన్ చూసి ప్రేక్షకులు నవ్వుకుంటున్నారు. సినిమాలో కథానాయకుడి భార్య చనిపోవడంతో భావోద్వేగానికి లోనవుతాడు.ఇప్పటికే థియేటర్‌లో ఆ ఎక్స్‌ప్రెషన్స్‌కి ప్రేక్షకులు నవ్వుకోగా, ఇప్పుడు ఇళ్లలో చూస్తున్న వారు కూడా అదే రిపీట్ చేస్తున్నారు.

ఈ చిత్రంలో అతనికి జోడీగా బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా నటించింది. సినిమాలో చాలా మంచి స్టార్ కాస్ట్ ఉన్నా హీరోలో విషయం లేనప్పుడు ఈలాగే ట్రోల్ల్స్ అవుతారని మళ్లీ నిజమైంది .

Tags: kollywood news, Saravanan Arul, Saravanan Arul trolls, the legend movie