స్టార్ హీరోయిన్ సమంత నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో దూసుకుపోతుంది. మధ్యలో మయోసైటీస్ వ్యాధికి గురైన ఆ తర్వాత కూడా అదే జోష్‌లో సినిమాలు చేసుకుంటూ పోతోంది. ఇదే క్రమంలో సమంత నటించిన యశోద, శాకుంతలం సినిమాలు బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయాయి.
అయినా సమంతతో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ లో కూడా పలు సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలో కూడా నటిస్తోంది సమంత. ఇదే క్రమంలో హాలీవుడ్ లో కూడా సమంతకు ఓ సినిమా ఆఫర్ వచ్చిందట. తనకంటే తక్కువ వయసున్న హీరోలతో కూడా సమంత ఆన్ స్క్రీన్ రొమాన్స్‌కు సై అంటోంది. ఇదే క్రమంలో విజయ్ దేవరకొండతో ఖుషి సినిమాలో నటిస్తుంది.
మరో యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డతో కూడా సమంత ఓ సినిమా చేయడానికి రెడీగా ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటు సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా సమంత ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. తాజాగా సమంత ఎయిర్ పోర్ట్‌లో కనిపించగా ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఫోటోలో సమంత బ్లాక్ జాకెట్ నడుముకు కొట్టుకొని ముఖానికి మాస్క్ ధరించి ఎంతో స్టైలిష్ గా కళ్లద్దాలు పెట్టుకుని నడుచుకుంటూ వెళుతోంది.
ఆ ఫోటోలలో సమంత బ్లాక్ స్లిప్పర్స్ ధరించగా వాటి కాస్ట్ గురించి ఓ వార్త వైరల్ గా మారింది. ఆ స్లిప్పర్స్ కాస్ట్ అక్షరాలా రూ.1,58,000లు కావడం విశేషం. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ బ్రో సినిమాలో ఆయన ధరించిన షూ కాస్ట్ లక్ష రూపాయలు వార్త కూడా బయటకు రావడంతో టాలీవుడ్ సినీ అభిమానులు స్టన్ అవుతున్నారు.
సమంత తన చెప్పుల కోసం ఈ రేంజ్ లో ఖర్చు చేస్తున్నారంటే ఆమె ఆదాయం ఏ రేంజ్‌లో ఉందో సులువుగా అర్థమవుతోంది. శాకుంతలం సినిమాకు సమంత ఏకంగా రూ.5 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఇదొక్కటే కాదు.. ఆమె వేసుకునే డ్రెస్సులతో పాటు అన్నీ చాలా కాస్ట్‌లీ ఐటెమ్సే. అవన్నీ లక్షల్లోనే ఉంటాయి.