సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకోవడం చాలా కష్టమైన విషయం. గుర్తింపు తెచ్చుకున్నా వారి కెరియర్ స్టార్ హీరోయిన్ గా ఎంత కాలం ? కొనసాగుతుంది అనే విషయాన్ని ఎవరు చెప్పలేరు. ఇప్పటికే చాలామంది హీరోయిన్లు స్టార్ హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకుని.. అగ్రహీరోలందరి సరసన నటించినా ప్రస్తుతం సైడ్ క్యారెక్టర్స్ లో నటిస్తూ కెరియర్ ను కొనసాగిస్తున్నారు. మరి కొందరు ఛాన్సులు రాక ఇండస్ట్రీకి దూరమయ్యారు.
అయితే ప్రస్తుతం ఈ లిస్టులో తమన్నా, సమంత పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఒకప్పుడు స్టార్ హీరోస్ అందరి సరసన నటిస్తూ బిజీ షెడ్యూల్ గడిపిన ఈ ముద్దుగుమ్మలకు ఇప్పుడు స్టార్ హీరోల సరసన చాన్సులు రావడం లేదు. ఇటీవల చిన్న చిన్న హీరోలతో మాత్రమే నటించిన సినిమాలు కూడా ఫ్లాప్ అవుతున్నాయి. వీరిద్దరి కెరియర్ ముగియడానికి ఒక కుర్ర స్టార్ హీరోయిన్ కూడా కారణమట. ఇంతకీ ఎవరా స్టార్ హీరోయిన్..? అనుకుంటున్నారా.
పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీ లీల. ఈమె చేసిన రెండు సినిమాలు హిట్ కావడంతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. దీంతో ప్రస్తుతం శ్రీ లీలకి స్టార్ హీరోల సినిమాల్లో వరుసగా ఛాన్సులు దక్కించుకుంటోంది. శ్రీ లీల ప్రస్తుతం బాలయ్య, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్, విజయ్ దేవరకొండ, వైష్ణవ తేజ్ ఇలా మరి కొంతమంది స్టార్ హీరోలతో కలిసి చాలా సినిమాల్లో నటిస్తోంది.
ప్రస్తుతం వరుస ఛాన్సులతో దూసుకుపోతున్న శ్రీ లీల తన క్రేజ్ మరింత పెంచుకోవడానికి స్పెషల్ సాంగ్స్ లో కూడా నటించబోతుందంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం సమంత, తమన్నాకు ఛాన్సులు ఇవ్వాలనుకుంటోన్న వారు కూడా శ్రీలీల వైపు మొగ్గు చూపుతున్నారట. ఏదేమైనా శ్రీలీల ఎంట్రీతో ఆల్మోస్ట్ సమంత, తమన్నా టాలీవుడ్ ఎగ్జిట్ కన్ఫార్మ్ అని ఇండస్ట్రీలో ఒక్కటే వినిపిస్తోన్న గుసగుస..?