పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న లేటెస్ట్ భారీ యాక్షన్ మూవీ సలార్. కేజీయఫ్ సీరిస్ సినిమాలతో పాన్ ఇండియా రేంజ్లో ఒక్కసారిగా సెన్షేషనల్ అయిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకుడు కావడంతో సలార్ క్రేజ్ మామూలుగా లేదు. అసలు ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా సినీ వర్గాల్లో ఎక్కడ చూసినా సలార్ పేరు మార్మోగుతోంది. ప్రభాస్ మానియా అయితే మామూలుగా లేదు.
ఇక కేజీయఫ్, కాంతారా సినిమాలతో ఇండియన్ సినిమా స్క్రీన్‌ను షేక్ చేసిన హోంబలె ఫిలిమ్స్ బ్యానర్ పై అత్యంత భారీ వ్యయంతో విజయ్ కిరాగందూర్ సలార్ సినిమాను నిర్మిస్తున్నారు. సలార్ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, ఈశ్వరి రావు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సలార్‌కు కేజీయఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా భువన గౌడ సినిమాటోగ్రాఫర్‌గా ఉన్నారు.
ఇటీవల రిలీజ్ అయిన సలార్ 1 టీజర్ కూడా అందరిని ఆకట్టుకుంది. జురాసిక్ పార్క్ అంటూ ప్రభాస్ మీద ఇచ్చిన ఎలివేషన్తోనే ఈ సినిమా రేంజ్ ఎలా ? ఉండబోతోందో చెప్పకనే చెప్పేశారు. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్‌కు మరో రెండు నెలలకు పైగా టైం ఉన్నా కూడా అదిరిపోయే రికార్డ్ సొంతం చేసుకుంది. ఇండియన్ సినిమా హిస్టరీలో మరే సినిమాకు సాధ్యం కాని రికార్డు సలార్ ఖాతాలో పడింది.
యుఎస్ డిస్ట్రిబ్యూటర్ ప్రత్యంగిర సినిమాస్ రిలీజ్ చేసిన అప్డేట్ ప్రకారం ఒక్క ఉత్తర అమెరికాలోనే ఏకంగా 1980కి పైగా లొకేషన్లలో సలార్ రిలీజ్ చేస్తున్నారట. ఇప్పటివరకు విడుదలైన ఏ ఇండియన్ సినిమాకు కూడా ఇన్ని లొకేషన్లు దక్కలేదట. దీనిని బట్టి సలార్‌కు ఓవర్సీస్లో ఎలాంటి క్రేజ్ ఉందో తెలుస్తోంది. సెప్టెంబర్ 27, 2023న ఈ సినిమా ప్రీమియర్ షోలు వేస్తున్నట్టు అక్కడి డిస్ట్రిబ్యూటర్లు చెపుతున్నారు.