చరణ్ కూతురు కోసం తారక్ కొడుకులు ఏం చేశారంటే… ఆ విషయంలో నాన్ననే మించిపోయారుగా..!

చాలామంది స్టార్ హీరోలు ఒకరితో ఒకరు మంచి స్నేహితులుగా ఉంటారు. వీరి కుటుంబాల్లో ఎవరి కుటుంబంలో మంచి జరిగినా.. ఎదుటివారి ఇంట్లో కూడా మంచి జరిగినట్టు ఫీల‌వుతూ ఉంటారు. అలా ఒకరి హ్యాపీనెస్ మరొకరు పంచుకునే స్నేహితులలో ఎన్టీఆర్- రామ్ చరణ్ కూడా ఉంటారు. వీళ్ళిద్దరూ స్క్రీన్ పై అలా కనిపించక పోయినా చాలా సందర్భాల్లో ఒకరిపై ఒకరికి ఉన్న స్నేహభావాన్ని వ్యక్తం చేస్తారు.

తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన దంప‌తుల‌కు అమ్మాయి క్లింకార పుట్టిన సంగతి తెలిసిందే.
పెళ్లి అయిన 11 ఏళ్ల త‌ర్వాత చ‌ర‌ణ్‌, ఉపాస‌న దంప‌తులు త‌ల్లిదండ్రులు అవ్వ‌డంతో ఇండ‌స్ట్రీ జ‌నాల నుంచి వాళ్ల‌కు శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఆ పాప‌కి తారక్ తో పాటు తారక్ కొడుకులు అభయ్, భార్గవ్ అంతా క‌లిసి ఓ ఎమోషనల్ గిఫ్ట్ పంపించారట.

ఇంతకీ ఏంటా ? గిఫ్ట్ అనుకుంటున్నారా. తారక్.. చరణ్, ఉపాసన, క్లింకార పేరుతో గోల్డ్ డాలర్, క్లింకారకు సంబంధించిన వస్తువులను స్పెషల్‌గా ప్యాక్ చేసి గిఫ్ట్ గా పంపించాడట. అలాగే తారక్ ఇద్దరి కొడుకులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ వాళ్ళిద్దరూ వేసిన డ్రాయింగ్స్‌ని క్లింకారకు గిఫ్ట్ గా ఇచ్చార‌ట.

ఆ డ్రాయింగ్‌లో వీళ్ళిద్దరూ క్లీంకారని చెల్లిగా ఫీల్ అయినట్టు వేశారట. రామ్ చరణ్ – ఉపాసన కూడా ఈ గిఫ్ట్‌ చూసి ఎమోషనల్ ఫీలై రిప్లై ఇచ్చారని స‌మాచారం. ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో క్యూట్ , వెరీ నైస్ అంటు కామెంట్స్ చేస్తున్నారు.