జపాన్ లో “RRR ” 21వ రోజు కలెక్షన్స్ ఎంతో తెలుసా!

SS రాజమౌళి మాస్టర్ పీస్ RRR నిజమైన గ్లోబల్ బ్లాక్‌బస్టర్ అని జపాన్‌లో దీనికి లభిస్తున్న భారీ స్పందనతో ఇది మరోసారి నిరూపించబడింది.జపాన్‌లో 3 వారాల క్రితం విడుదలైన, జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో నటించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా, జపాన్ బాక్సాఫీస్ వద్ద చాలా మంచి వసూళ్లు సాధిస్తోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, 21వ రోజు వసూళ్లు 1వ రోజు కంటే ఎక్కువగా ఉన్నాయి. ఇది నిజంగా ఆకట్టుకునే అచీవ్‌మెంట్ సినిమాకు వచ్చిన అఖండమైన స్పందనతో మేకర్స్ చాలా సంతోషంగా ఉన్నారు.

ఈ చిత్రం మొత్తం 206 మిలియన్ యెన్ (రూ. 11 కోట్లు) వసూలు చేసిన ఈ చిత్రం ఎంత వరకు రాబట్టుతుందో వేచి చూడాలి.అలియా భట్, అజయ్ దేవగన్, సముద్రఖని, ఒలివియా మోరిస్, శ్రియా శరణ్ ఇతరులు కూడా ఈసినిమాలో భాగమయ్యారు, డివివి దానయ్య భారీ స్థాయిలో నిర్మించారు. ఈ బ్లాక్ బస్టర్ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.

Tags: japan rrr movie collections, rrr collections, RRR Movie, SS Rajamouli