సినిమా రంగంలో ఒకప్పుడు కథలురాసేవారు ప్రత్యేకంగా ఉండేవారు. లేదా.. కొన్నికొన్ని సందర్భాల్లో నవ లలను కూడా సినిమాలుగా తీసిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా అటు తమిళంలో, ఇటుతెలుగులో ఒకప్పుడు.. అగ్ర కథకులు ఉండేవారు. వారు రాసిన కథలకు పెద్ద డిమాండ్ ఉండేది. మాజీ సీఎం కరుణా నిధి కథలకు ఎక్కడా లేని డిమాండ్ ఉండేది. మన దగ్గర అప్పట్లో సముద్రాల కథలకు పెద్ద డిమాండ్.
అయితే.. తర్వాత కాలంలో వచ్చిన దర్శకులు.. బాలు మహేంద్ర, బాలచందర్, దాసరి నారాయణరావు వంటివారు.. తామే కథలు సిద్ధం చేసుకుని అడుగు ముందుకు వేసేవారు. పరాయి భాషల్లో కథలు నచ్చితే కొని వాడుకునేవారు. పెద్దగా కథకుల జోలికి పోయేవారు కాదు. దాసరి నారాయణరావు 100 సినిమాలకు దర్శకత్వం వహిస్తే.. దాదాపు 80 సినిమాలకు ఆయన రాసుకున్న కథలే ప్రాణం పోశాయి.
ఇక, తమిళంలో అయితే..బాలచందర్, బాలుమహేంద్రలు కథలకు ప్రశిద్ధి. వారు రాసిన కథలకు ఎనలేని డిమాండ్ ఉండేది. అందుకే వారి సినిమాలు కూడా అలానేవందలు సంవత్సరాల తరబడి ఆడాయి. ఇక, ఏ దర్శకుడి కథను చూసినా.. వారిలో ప్రత్యేకత కనిపిస్తుంది. ఇలాంటి వారిలో బాలచందర్ రాసే ప్రతికథలోనూ.. ఒక విభిన్న కోణం కనిపిస్తుంది. ఆయన తీసిన సినిమాల్లో ఎక్కడొ ఒక చోట ఈ కోణం కనిపిస్తుంది.
అది.. ఒక మహిళను, ఆమె కూతురును కూడా.. ఒకే వ్యక్తి ప్రేమించడం.. లేదా.. ఒక మహిళను ఒక తండ్రి, ఆమెకూతురును ఆయన కుమారుడు ప్రేమించడం.. వంటివి కథలుగా ఉండేవి. ఉదాహరణకు.. అంతులేని కథ సినిమా సూపర్ హిట్. ఇందులో ఒక మహిళ(జయంతి), ఆమె కూతురు(ఫటాఫట్ జయలక్ష్మి)లను ఒకే వ్యక్తి వాడుకుంటాడు.
తూర్పు పడమర సినిమా(కథ బాలచందర్)లో ఒక మహిళను కొడుకు ప్రేమిస్తే.. ఆమె కూతురుతో అతని తండ్రి పెళ్లి వరకు సాగడం.. ఇలాంటి విభిన్న కథలను ఆయన రాసేవారు. అయితే.. ఇవి వావి.. వరసలు లేకుండాపోయినా.. అప్పట్లో ఇవే హిట్లు గా నిలిచాయి.