రవితేజ”టైగర్ నాగేశ్వరరావు”పక్క హిట్టే ..ఎందుకో తెలుసా !

టైగర్ నాగేశ్వరరావు అనే పాన్-ఇండియన్ చిత్రంతో మాస్ మహారాజ్ తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోనున్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ సినిమా దర్శకుడు వంశీ. దీనిలో రవితేజ ఒక క్రూరమైన దొంగగా టైటిల్ రోల్ పోషిస్తున్నాడు.ఈ చిత్రం 1970 లలో ఆంధ్ర ప్రదేశ్ నేపథ్యంలో జరుగుతుంది. విమర్శకుల ప్రశంసలు పొందిన బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు.ఈ స్టోరీ లైన్తో ఇంప్రెస్ అయిన అనుపమ్ ఖేర్ ప్రాజెక్ట్‌పై సంతకం చేశారు. ది కాశ్మీర్ ఫైల్స్‌తో సహ నిర్మాతగా వ్యవహరించిన అభిషేక్ అగర్వాల్ టైగర్ నాగేశ్వరరావును నిర్మిస్తున్నారు .

కృతి సనన్ సోదరి నూపుర్ సనన్ టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో కథానాయికగా పరిచయం అవుతుండగా, గాయత్రి భరద్వాజ్ మరో కథానాయిక. ఈ చిత్రం వచ్చే ఏడాది తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. రవితేజ ఇటీవల రామారావు ఆన్ డ్యూటీ వంటి భారీ డిజాస్టర్ మూవీను అందించాడు.స్టార్ టైగర్ నాగేశ్వరరావుతో పాటు ధమాకా మరియు రావణాసుర చిత్రాలో చేస్తున్నాడు.

Tags: Anupam Kher, Ravi Teja, tiger nageswararao movie, tollywood news