Rashi Khanna : అమ్మో రాశి ఏంటి అందాల రచ్చ..!

ముందు బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చినా టాలీవుడ్ లో సెటిల్ అయిన ఢిల్లీ భామ రాశి ఖన్నా (Rashi Khanna) మొన్నటిదాకా గ్లామర్ విషయంలో కొద్దిగా ఆలోచించగా ఇప్పుడు గ్లామర్ గేట్లు ఎత్తేసినట్టు ఉంది. స్కిన్ షో విషయంలో అంతకుముందు మొహమాట పడిన రాశిఖన్నా ఇప్పుడు ఏమాత్రం అడ్డు అదుపులేకుండా అందాలతో అదరగొట్టేస్తుంది. గ్లామర్ షోలో పీక్స్ కి వెళ్తున్న అమ్మడు లేటెస్ట్ గా మరో హాట్ ఫోటో షూట్ తో ఆడియెన్స్ ని అవాక్కయ్యేలా చేసింది. తన పరువాలన్ని కనిపించేలా అమ్మడు చేస్తున్న ఈ అందాల రచ్చ ఆడియెన్స్ కి నిద్ర పట్టడం లేదంటే నమ్మాలి.

సినిమాల్లో గ్లామర్ షోకి కాస్త దూరంగా ఉంటున్న రాశి ఖన్నా (Rashi Khanna) ప్రైవేట్ ఫోటో షూట్ లతో మాత్రం క్లైమెట్ వేడెక్కించేస్తుంది. లేటెస్ట్ గా వైట్ అండ్ వైట్ బికిని స్టిల్స్ తో అమ్మడు అదరగొట్టేస్తుంది. ఈమధ్యనే వచ్చిన పక్కా కమర్షియల్, థ్యాంక్యు రెండు సినిమాలు రాశిని నిరాశపరచాయి.

తెలుగులో కెరియర్ అటు ఇటుగా ఉండగా ఈమధ్య వరుసగా తమిళ ఛాన్సులు అందుకుంటుంది. లేటెస్ట్ గా ధనుష్ తిరు సినిమాలో నటించిన అమ్మడు ఆ సినిమాతో హిట్ అందుకుంది. అక్కడే సర్దార్ సినిమా చేస్తుంది. హిందీలో కూడా యోధ సినిమా చేస్తుంది రాశి ఖన్నా.

Tags: Rashi, rashi khanna, Rashi Khanna Photoshoot, Rashi Khanna Updates, Thankyou