5 రోజులకే బిజినెస్ క్లోజ్‌.. నాగ‌శౌర్య కెరీర్‌కు ఎండ్ కార్డు వేసిన ‘ రంగ‌బ‌లి ‘ ..!

కొంతకాలంగా యంగ్ హీరో నాగ శౌర్య నటిస్తున్న ప్రతి సినిమా ఫ్లాప్ అవుతుంది. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా ఈసారి ఎలా అయినా హిట్ కొట్టాలని కసితో కమర్షియల్ ఎంటర్టైనర్ చిత్రం రంగబ‌లి సినిమాలో నటించాడు శౌర్య‌. తాజాగా భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రమోషన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ముఖ్యంగా కమెడియన్ సత్య చాలామంది పాపులర్ యాంకర్స్‌ని ఇమిటేట్ చేస్తూ నాగశౌర్యను ఇంటర్వ్యూ చేసిన విధానం ప్రేక్షకులను ఎంతగానో నవ్వించింది. అలాంటి యాంగిల్లో డైరెక్టర్ ఆలోచించాడు అంటే ఇతనిలో చాలా క్రియేటివిటీ ఉందని.. సినిమాలో కూడా ఏదో కొత్తదనం ఉండే ఉంటుందని అంద‌రు ఊహించారు.

కానీ ఫస్ట్ షో నుంచే డివైడ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా కనీసం ఓపెనింగ్స్ కూడా రాబ‌ట్ట‌లేకపోయింది. ఫస్ట్ హాఫ్ లో కమెడియన్ సత్య కామెడీ బాగా పండించినా సినిమాకు పాజిటివ్ టాక్ తీసుకురాలేకపోయింది. కారణం చెప్పలేము గాని ఈ సినిమాని థియేటర్లో చూడడానికి ప్రేక్షకులు ఎందుకో ? ఆసక్తి చూపలేదని అర్థమవుతుంది. రంగ‌బ‌లి సినిమాతో బౌన్స్ బ్యాక్ అవుదామని అనుకున్న నాగశౌర్యకి సినిమా ఫ్లాప్ అవడంతో మళ్లీ చుక్కెదురయింది.

సినిమా ఫ్రీ రిలీజ్ థియ‌ట్రిక‌ల్ బిజినెస్ దాదాపు రూ. 6.50 కోట్ల రూపాయలు జరగగా ఇప్పటివరకు ఈ సినిమాకు కేవలం రూ.3 కోట్ల రూ.20 లక్షల షేర్‌ మాత్రమే వచ్చాయట. అంటే ఇంకా బ్రేక్ ఈవెన్ కి రూ.3 కోట్ల రూ.25 లక్షల పైన షేర్స్ రావాల్సి ఉంది.. ఇక ఐదు రోజుల‌కే థియేట‌ర్ల నుంచి ఎత్తేయ‌డంతో ఈ సినిమా డిజాస్ట‌ర్ అని తేలిపోయింది. నాగశౌర్య ఈ ఎదురుదెబ్బ నుంచి కోలుకుని స‌రైన క‌థ‌లు ఎంచుకోక పోతే రంగ‌బ‌లి అత‌డి కెరీర్‌కు ఎండ్ కార్డు అనుకోవాల్సిందే..!