మెగా ఇంట్లోకి బుల్లి యువరాణి ఎంట్రీ… మెగా ఫ్యాన్స్‌కు ఇంత బిగ్ స‌ర్‌ఫ్రైజా…!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన దంపతులు తల్లిదండ్రులైన సంగతి అందరికీ తెలిసిందే. ఇక వారికి పండంటి ఆడపిల్ల పుట్టింది. అది కూడా అదృష్ట జాతకంలో ఆమె జన్మించిందని జ్యోతిష్యులు కూడా చెబుతున్నారు. అంతేకాకుండా మెగా ఫ్యామిలీకి శుభాలు కలిగిస్తుందని అందరూ అంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే తనకు మనవరాలు పుట్టడంపై పట్టరాని ఆనందం వ్యక్తం చేశారు.

Ram Charan, Upasana dress in all-white for teddy bear-themed baby shower  (WATCH)

ఇక అంతేకాకుండా తన సంతోషాన్ని అందరితో పంచుకున్నారు. ఇప్పటివరకు హాస్పిటల్లో ఉన్న ఉపాసన మరికొద్ది గంటలో డిస్చార్జ్ కాబోతున్నారట. అపోలో హాస్పిటల్స్ నుంచి నేరుగా మెగాస్టార్ ఇంటికి వెళ్ళనున్నారట. ఉపాసన కూడా ఇప్పటికే ఓ ఇంటర్వ్యూలో బిడ్డ పుట్టిన తర్వాత కూడా తన అత్త మామ వాళ్ళ ఇంటికి వెళ్తారని క్లారిటీ ఇచ్చింది.

ఈ క్రమంలోనే రామ్ చ‌ర‌ణ్‌- ఉపాసన తన అత్తవారింటికి వెళ్లే ముందు అపోలో హాస్పిటల్స్ దగ్గర మీడియాతో కాసేపు మాట్లాడతారని కూడా తెలుస్తుంది. ఇక త‌మ సంతోషాన్ని షేర్ చేసుకునే అవకాశం ఉందని అలాగే ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తోంది. అంతేకాకుండా ఉపాసనకు ఆపరేషన్ చేశారా..? లేక నార్మల్ డెలివరీ..? అయిందా అన్నది ఇంకా ఎవరికీ తెలియదు.

Ram Charan and wife Upasana Kamineni welcome a baby girl

ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ లో ఉపాసన రామ్‌చరణ్ ఈ విషయంపై నోరు విప్పుతారా ? లేదా అనేది తెలియాల్సి ఉంది. అంతేకాకుండా ఈ మెగా వారసురాలిని చూడాలని మెగా అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు ఆ పాప ఫోటో కానీ.. పిక్చర్ కానీ ఇప్పటికీ బయటకు రాలేదు. ఇప్పుడు ఆ ఫోటో రిలీజ్ చేస్తారా..? లేదా..? అన్నది సస్పెన్స్ గా మారింది. మరికొద్ది గంటలోనే వీటన్నిటికీ సమాధానం రానుంది.