రామ్ “ది వారియర్ ” అక్కడ భారీ డిజాస్టర్ !

రామ్ పోతినేని ఇటీవల ‘ఇస్మార్ట్ శంకర్’తో కెరీర్ బెస్ట్ బ్లాక్ బస్టర్ చూశాడు, టాలీవుడ్తో పాటు తమిళ సినిమా మార్కెట్‌లో పట్టు సాధించాలనే ప్రయత్నం తో అతను “ది వారియర్” కోసం లీన్ దశలో ఉన్న తమిళ దర్శకుడు లింగుసామితో జతకట్టాడు. కానీ అతని ప్లాన్ ఫలించలేదు.రెండు వైరల్ పాటలు ఉన్నప్పటికీ, “ది వారియర్” USAలో బాక్సాఫీస్ డిజాస్టర్ నిలవబోతుంది.

ఇండియన్ స్క్రీనింగ్స్ కంటే ముందుగా USAలో ప్రీమియర్ షోలు ప్రదర్శించకుండా మేకర్స్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.ఈ సినిమా యూఎస్‌ఏలో విడుదలైన సమయంలోనే భారత్‌లో తొలి ప్రదర్శన జరిగింది.ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న సినిమాకు పెద్దగా ఉపయోగపడలేదు. మొదటి వారాంతంలో, ఈ చిత్రం $100k లోపు వసూలు చేసింది. ప్రివ్యూల నుండి $40k ఆదాయం వచ్చిన తర్వాత ఎటువంటి కలెక్షన్స్ పెరగలేదు.

రామ్ పోతినేని సినిమా బ్రేక్ ఈవెన్ దశకు చేరుకోవడానికి $425k కలెక్ట్ చేయాలి. వారాంతంలో దాదాపు $100k కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా భారీ నష్టాలను చవిచూస్తోంది.ఈ సినిమా ప్రొమోషన్స్కి పెద్దగా డబ్బు ఖర్చుపెట్టలేదు. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ పెట్టుబడిలో 75% లాస్ అవ్వడం పక్కాగా కనబడుతుంది .

Tags: Krithi Shetty, ram pothineni, the warrior, the warrior usa collections, the warrior world wide collections