500 మిలియన్ల వ్యూస్‌తో రికార్డు సృష్టించిన ‘రారా రెడ్డి’ సాంగ్

యంగ్ హీరో నితిన్ నటించిన మాచర్ల నియోజకవరం ఆగస్టు 12న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల కానుంది.ఇటీవ‌ల విడుద‌లైన ట్రైల‌ర్ అటు మాస్‌లోనూ ఇటు క్లాస్‌లోనూ అంచ‌నాలు పెంచేసింది.ఈ సినిమా నుంచి ఇంతకు ముందు విడుదలైన రారా రెడ్డి పాట చార్ట్‌బస్టర్‌గా నిలిచింది.

నితిన్ డ్యాన్స్ మరియు అంజలి గ్లామర్‌తో పాటు ‘రాను రాను అంటూనే చిన్నదో’ పాటలోని హుక్ లైన్ ఇన్‌స్టంట్ విన్నర్‌గా నిలిచింది.మహతి స్వర సాగర్ స్వరపరిచిన ఈ పాట సోషల్ మీడియా మరియు అన్ని చిన్న వీడియో యాప్‌లులో దూసుకుపోయింది.ఈ పాట ఇప్పుడు అరుదైన ఘనత సాధించింది. ఈ ప్లాట్‌ఫారమ్‌లన్నింటిలో ఇది 500 మిలియన్లకు పైగా వీక్షణలను సంపాదించింది. ఏ సినిమాకు దక్కని అరుదైన ఘనత ఇది.

Tags: actor nithin, Macherla Niyojakavaram movie, Ra Ra Reddy song