ఎక్స్ క్లీజివ్: ప్రాజెక్ట్ కే గ్లింప్స్.. సమాధానాలు రాని ప్రశ్నలు..?

ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న సినిమా ప్రాజెక్ట్ కే. నాగ అశ్విన్ దర్శకత్వంలో రూపొందించబడుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలను నెలకొన్నాయి. దాన్ని రెట్టింపు చేస్తూ నిన్న ప్రాజెక్ట్ కే ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకి కల్కి టైటిల్ ఫిక్స్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా 2 భాగాలుగా రిలీజ్ అవుతుంది అంటూ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంకా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సందేహాలు, సమాధానాలు దొరకాల్సి ఉంది.

నిర్మత అశ్విని దత్ ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కించాలనే ప్లాన్ తో ఉన్నారట. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే . ఈ మూవీ మొదలు పెడుతున్నప్పుడు రెండు భాగాలుగా తీయాలన్న ఆలోచన నాగ అశ్విన్ కి లేదు కానీ ఇప్పుడు మాత్రం అదే ఆలోచనలో ఉన్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

దీనివల్ల బడ్జెట్ ఇబ్బంది కూడా ఉండదని భావిస్తున్నారని సమాచారం. కాని గ్లింప్స్ లో దీనికి సంబంధించిన ఎటువంటి హింట్ ఇవ్వలేదు. ఒకవేళ ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ అయితే దానికి సంబంధించిన హింట్ ఏదో ఒకటి గ్లింపస్ లో ఉండాలి. కానీ అటువంటి హింట్ ఏది ఇవ్వలేదు . దీంతో ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ అవుతుందా ..?లేదా అనేది ఇంకా సందేహం గానే ఉంది.

2024 సంక్రాంతిలో రిలీజ్ అవుతుందని నిన్న వచ్చిన టీజర్ లో చూపించారు. కానీ ఇంకా ఈ సినిమా షూటింగ్ పూర్తి కాలేదు. దీంతో ఈ సినిమా 2024 వేసవిలో రిలీజ్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ చేసినట్లయితే 2024 సంక్రాంతికి మొదటి భాగం రిలీజ్ అవుతుంది. ఒకే భాగంగా రిలీజ్ చేయాలంటే మాత్రం 2024 వేసవి వరకు ఈ సినిమా కోసం వేచి చూడాలని అభిప్రాయపడుతున్నారు నెటిజన్స్. ఇంకా దీనిపై క్లారిటీ రావాల్సిఉంది..!