ఆదర్శ ఇల్లాలు…పబ్లిక్ లో అడ్డంగా దొరికిపోయిన భార్య.. వీడియో వైరల్..!!

ఎటువంటి బంధంలోనైనా ముఖ్యంగా భార్యా, భర్తల సంబంధం లో మనకు కావలసినది నమ్మకం, నిజాయితీ. అవే లోపిస్తే బంధం బీటలు బారుతుంది. సమాజం.. కట్టుబాట్లు.. పక్కన పెడితే మనల్ని నమ్ముకుని మన కోసం చూసే వారిని మోసం చేయకూడదని ఆలోచన నైతిక విలువలు మనలో ఉండాలి. అవి లేని బంధం ఎప్పటికైనా కుప్పకూలుతుంది. ఇక ఇటీవల కాలంలో పెళ్లైన తర్వాత అక్రమ సంబంధాల పెట్టుకుని ఎన్నో నేరాలు జరుగుతున్న వార్తలు చూస్తూనే ఉన్నామ్.

ప్రేమ, పెళ్లి, పిల్లల అనే బంధాల గురించి ఆలోచన లేకుండా విచ్చలవిడిగా ప్రవర్తించి తమ సుఖాల కోసం అక్రమ సంబంధాలను పెట్టుకుంటూ మంచి వ్యక్తులతో బంధాలను తెంచుకుంటునారు. ఇక ఇలాంటి సంఘటన తాజాగా ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. భర్తకు తెలియకుండా ప్రియుడుతో రొమాన్స్ చేస్తూ రెడ్ హ్యాండెడ్గా భర్తకు దొరికిపోయింది. దాని గురించి ప్రశ్నించగా మహిళా భర్తనే తిట్టి అతడి పై దాడి చేసింది. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఒక మాల్ లో ఈ వీడియోను రికార్డు చేశాడు. బాధితుడు భార్య తనకు తెలియకుండా మరో వ్యక్తితో మాల్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తుంటే భర్త సీక్రెట్ గా వాళ్లని ఫాలో చేస్తూ వారిద్దరూ కలిసి క్లోజ్ గా నడుచుకుంటూ మాల్ లో వెళ్తున్న వీడియోను షూట్ చేశాడు.

మహిళా ఒక షాప్ దగ్గర ఆగడంతో భర్త ఆమె ముందుకు వెళ్ళాడు. సడన్గా భర్తను అక్కడ చూసిన భార్య షాకై తన ఫ్రెండ్ తో కలిసి వచ్చానని కవర్ చేయడానికి ట్రై చేసింది. దాంతో భర్త నన్ను మోసం చేసి వీడితో తిరుగుతున్నావా.. చేతిలో చేయి వేసుకొని తిరుగుతూ ఫ్రెండ్ అని అబద్ధం చెపుతున్నావు.. నాకు నువ్వు అక్కర్లేదు విడాకులు ఇస్తాను అంటూ చెప్పడంతో కోపానికి గురైన ఆ మహిళ దగ్గరికి వచ్చి అతడి పై దాడి చేసింది. పక్కన ఉన్న వాళ్ళు ఆపడానికి ప్రయత్నించిన కానీ ఆమె ఆగకుండా రెచ్చిపోయింది. నాకు నచ్చినట్లు నేను ఉంటాను.

నువ్వు ఎవరు? నన్ను అడగడానికి అంటూ అతనిపై రివర్స్ అవడంతో ఆ వ్యక్తి మీ ఇద్దరి బాగోతాన్ని నేను వీడియో తీశాను అంటూ ఆ వీడియోను అందరికీ చూపిస్తూ తనకు జరిగిన అన్యాయం గురించి వివరించాడు. మేమిద్దరం ఐదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నామని కుటుంబ సభ్యుల తమ బంధాన్ని అంగీకరించలేదని భార్య తన కుటుంబాన్ని వేధిస్తుందని చెప్పుకొచ్చాడు. భార్య ప్రవర్తన చూసిన భర్త చాలా అసభ్యకరమైన భాషను ఉపయోగించాడు . ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటికే 13 లక్షలకు పైగా జనం ఈ వీడియోని చూశారు. ప్రతి ఒక్కరు భర్తకే సపోర్ట్ చేస్తూ ఆమెని బండ బూతులు తిడుతూ కమెంట్స్ చేస్తున్నారు.