నేషనల్ స్టార్, మన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న వరస పాన్ ఇండియా సినిమాల పరంపరలో సలార్ – కల్కి సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. సలార్ సినిమా సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కల్కి 2898 AD అనే సైంటిఫిక్ ఫాంటసీ మూవీ కూడా వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
తాజాగా రిలీజ్ అయిన టైటిల్ గ్లింప్స్ చూస్తుంటే ఇండియన్ సినీ జనాల ఫ్యీజులు ఎగిరిపోతున్నాయి. కానీ విని ఎరుగని రేంజ్ లో ఈ విజువల్స్ ఉన్నాయి. ప్రభాస్‌కు జోడిగా బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తుండగా.. కోలీవుడ్ సీనియర్ నటుడు లోకనాయకుడు కమలహాసన్ విలన్ గా నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ బిగ్ బీ అమితాబచ్చన్ తో పాటు మరో బాలీవుడ్ ముద్దుగుమ్మ దిశా పటానికి కూడా కీలక పాత్రలలో కనిపిస్తున్నారు.
ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ పై కొత్త అప్డేట్ వినిపిస్తోంది. ముందుగా సంక్రాంతి రేసులో నిలపాలని అనుకున్నారు. అయితే ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్, సినిమా నిర్మాణాంతర కార్యక్రమాల కోసం మరింత సమయం తీసుకుంటున్నాడట దర్శకుడు నాగ్ అశ్విన్. ఈ క్రమంలోనే తమ వైజయంతి మూవీస్ బ్యానర్లో వచ్చిన జగదేకవీరుడు అతిలోకసుందరి – మహానటి లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాల రిలీజ్ డేట్ సెంటిమెంట్‌నే కల్కి సినిమాకు కూడా అప్లై చేస్తున్నారు.
కల్కి సినిమాను మే 9న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై త్వరలోనే నిర్మాత అశ్వినీ దత్ అధికారక ప్రకటన ఇస్తారని తెలుస్తోంది. ఏది ఏమైనా కల్కి సినిమాను పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్ రేంజ్ సినిమాగా మలచటానికి దర్శకుడు నాగ్ అశ్విన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. రు. 600 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.