పవన్ ఢిల్లీ వెళ్తే వైసీపీలో వణుకు ఎందుకు…?

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత పరిస్థితులు కాస్త ఇబ్బందికరంగా ఉన్న సంగతి తెలిసిందే. మూడు రాజధానులు అంటూ నెల రోజుల క్రితం ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటనపై రాజధాని ప్రాంతమైన అమరావతితో పాటుగా కృష్ణా గుంటూరు జిల్లాల్లో రాజధాని ఉద్యమం పెద్ద ఎత్తున జరుగుతుంది. జగన్ ప్రకటన తర్వాత వచ్చిన కమిటీ నివేదికలు అన్ని కూడా వివాదాస్పదంగా మారాయి. ఆ ప్రకటనలతో ఒక్కసారిగా రాజకీయ దుమారం రేగింది.

అటు తెలుగుదేశం పార్టీ కూడా ఈ ఉద్యమాన్ని ముందు ఉండి నడిపిస్తుంది. ఈ తరుణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నపళంగా ఆదివారం ఢిల్లీ పర్యటనకు వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన ఆయన ఆర్ ఎస్ ఎస్ నేతలతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ఆయన వారితో చర్చించారు. ఇక సోమవార౦ మధ్యాహ్నం బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్ జెపి నడ్డాతో సమావేశమై జనసేన, బిజెపి పొత్తు గురించి చర్చించారు. భవిష్యత్తులో ఈ రెండు పార్టీలు కూడా కలిసి రాష్ట్రంలో ప్రభుత్వంపై పోరాడే అవకాశాలు కనపడుతున్నాయి.

ఇప్పుడు ఇది వైసీపీకి ఇబ్బదికరంగా మారింది. బిజెపి, జనసేన పార్టీలు కలిస్తే తెలుగుదేశం పార్టీకి కూడా కలిసి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అమరావతి ఉద్యమం జాతీయ స్థాయిలోకి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే పవన్ ఢిల్లీ వెళ్ళగానే ఏదో జరుగుతుంది అనే కంగారు వైసీపీ నేతల్లో మొదలైందని, ఇప్పుడు వాళ్ళు పవన్ ని టార్గెట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే పవన్ వ్యాఖ్యలతో ఇబ్బంది పడుతున్న వైసీపీ అధిష్టానం, ఆయన బిజెపితో కలిస్తే రాష్ట్రంలో వైసీపీతో పెద్దగా బిజెపికి అవసరం ఉండదనే వ్యాఖ్యలుకుడా వినపడుతున్నాయి.

Tags: amaravathi, AP, Delhi Tour, JanaSenaParty, pawankalyan, ysrcp