పవన్‌కళ్యాణ్ టు ఎన్టీఆర్ వరకు.. ఈ స్టార్ల‌కు ఇష్టమైన హీరోయిన్లు ఎవరో తెలుసా..!

చిత్ర పరిశ్రమలో ఉండే హీరోయిన్లకు నచ్చిన స్టార్ హీరోలు ఉంటారు. అలాగే స్టార్ హీరోలకు నచ్చిన హీరోయిన్లు కూడా ఉంటారు. ఇక అది అలనాటి సీనియర్ హీరోయిన్లు కావచ్చు.. నేటితరం స్టార్ హీరోయిన్లు కావచ్చు. ఇక ఇప్పుడు మన టాలీవుడ్ స్టార్ హీరోలకు కూడా ఫేవరెట్ హీరోయిన్లు ఎవరనేది వారి అభిమానులకి ఎంతో ఆసక్తిరేకెత్తించే అంశం.

ఇదే విషయంపై గతంలో ఎన్నో సందర్భాల్లో తమ ఫేవరెట్ హీరోయిన్ ల గురించి పవన్ కళ్యాణ్ నుంచి ఎన్టీఆర్ వరకు వారికి ఇష్టమైన హీరోయిన్ల పేర్లు చెప్పారు. బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా హీరోగా మారిన ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్నారు. ప్రభాస్ కూడా గతంలో ఓ ఇంటర్వ్యూలో తనకు ఇష్టమైన హీరోయిన్ ఎవరో చెప్పారు. దీపికా పదుకొనె అంటే ఎంతో ఇష్ట‌మ‌ట‌.

ఇప్పుడు ఈ పాన్ ఇండియా హీరో తనకి ఇష్టమైన హీరోయిన్ తో కలిసి ప్రాజెక్టు కే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు కూడా ఇష్టమైన హీరోయిన్ మహానటి సావిత్రి.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఎన్టీఆర్ కూడా మహానటి సావిత్రి అంటేనే ఎంతో ఇష్టమని ఓ సందర్భంలో అయ‌న‌ చెప్పుకొచ్చారు. సూపర్ స్టార్ మహేష్ బాబుకు అతిలోకసుందరి శ్రీదేవి అంటే ఎంతో ఇష్టమట.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా దూసుకుపోతున్నాడు. రీసెంట్ గానే తండ్రిగా ప్రమోట్ అయిన రామ్ చరణ్‌కు కూడా శ్రీదేవి అంటే ఎంతో ఇష్టమట. స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మరిన బన్నీకి కూడా బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రాణి ముఖర్జీ అంటే ఎంతో ఇష్టమట. అర్జున్ రెడ్డి సినిమాతో యువతలో భారీ క్రేజ్ సంపాదించుకున్న‌ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా ప్రస్తుతం సమంతతో కలిసి ఖుషి సినిమా చేస్తున్నాడు. ఈ రౌడీ హీరోకి కూడా బాలీవుడ్ హీరోయిన్ రాధిక ఆప్టే అంటే ఎంతో ఇష్టమట.

ఈ హీరోలే కాకుండా రానాకు కత్రినా కైఫ్, మరో యంగ్ హీరో రామ్‌కు శ్రీదేవి అంటే ఎంతో ఇష్టమట. అలాగే అల్లరి నరేష్ కూడా శ్రీదేవినే ఫేవరెట్ హీరోయిన్ అట. మరో యాక్షన్ హీరో గోపీచంద్‌కు కూడా సహజ నటి సౌందర్య అంటే ఎంతో ఇష్టమట. ఇలా ఒక్కో హీరో ఒక్కో హీరోయిన్ మీద త‌మ అభిమానం బ‌య‌ట పెట్టుకున్నారు.