సమంత హీరోయిన్ కాక‌పోతే ఏమ‌య్యేదో తెలుసా.. అదృష్టం అంటే ఇదే క‌దా..!

టాలీవుడ్ లోనే స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న సమంత కెరీర్ ఎప్పుడూ ఏదో ఒక సంచ‌ల‌నాత్మ‌కంగానే ఉంటోంది. కోలీవుడ్ క్రేజీ డైరెక్ట‌ర్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఏం మాయ చేసావ్ సినిమా ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తొలి సినిమాతోనే సూపర్ హిట్‌ను అందుకున్న సమంత. ఆ తర్వాత టాలీవుడ్ లో వరుస‌ విజయాల అందుకుని ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది.

ఒకానొక టైంలో స్టార్ హీరోల సినిమాల్లో వ‌రుస‌గా న‌టిస్తూ క్ష‌ణం తీరిక లేనంత బిజీగా ఉండేది. అస‌లు స‌మంత కాల్షీట్లు దొరికితే చాలు సినిమా హిట్టే అన్నంత పాపుల‌ర్ అయ్యింది. ప్రస్తుతం సమంత పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకుని స్టార్‌ బ్యూటీగా రాజ్యమేలుతోంది. ఇదే సమయంలో సమంత ఒకవేళ హీరోయిన్‌గా చిత్ర పరిశ్రమలోకి రాకుండా ఉంటే మాత్రం కచ్చితంగా ఎయిర్ హోస్టెస్ అయి ఉండేదట.

మొదటి నుంచి ఈమెకు ఎయిర్ హోస్టర్స్ అంటే ఎంతో ఇష్టమ‌ట, గౌరవం మాట. వారి డ్రెస్సింగ్ స్టైల్ ..వాళ్ళ రెస్పెక్ట్ అన్న సమంతకు ఎంతో ఇష్టమట. ఇక‌ సినిమాలో అవకాశం రాకుండా ఉంటే మాత్రం కచ్చితంగా ఎయిర్ హోస్టస్ అయ్యేదాన్ని గతంలో సమంతా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ఒకటి వైరల్ గా మారింది. ప్రస్తుతం ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు అభిమానులు.

ఇదే సమయంలో సమంత తన భర్త నాగచైతన్యకు విడాకులు ఇచ్చేసి సింగిల్గా తన లైఫ్‌ణు ఎంజాయ్ చేస్తుంది. ప్రజెంట్ వ‌రుస‌ సినిమాల్లో నటిస్తూ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు దూసుకుపోతుంది. ఇక తెలుగులో విజయ్ దేవరకొండ తో ఖుషి సినిమాలో నటిస్తుంది బ్యూటీ. అలాగే హాలీవుడ్ సిటాడెల్ వెబ్‌సీరిస్ హిందీ వెర్ష‌న్‌లో బాలీవుడ్ హీరో వ‌రుణ్ థావ‌న్‌తో క‌లిసి న‌టిస్తోంది.