BRO ‘ ర‌న్ టైం… ప‌వ‌న్ బొమ్మ‌కు అప్పుడే బ్లాక్‌బ‌స్ట‌ర్ టాక్..

ప‌వ‌ర్‌స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా బ్రో. కోలీవుడ్‌లో హిట్ అయిన వినోద‌య సితం సినిమాకు రీమేక్‌గా ఈ బ్రో సినిమా తెర‌కెక్కింది. కోలీవుడ్ నటుడు, ద‌ర్శ‌కుడు స‌ముద్ర‌ఖ‌ని ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఫీపుల్స్ మీడియా ప్యాక్ట‌రీ బ్యాన‌ర్‌పై భారీ బ‌డ్జెట్‌తో అతి త‌క్కువ టైంలోనే ఈ సినిమా చ‌క‌చ‌కా పూర్తి చేసేశారు.

బ్రో సినిమా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేందుకు గ‌ట్టిగా రెండు వారాల టైం మాత్ర‌మే ఉంది. ఇక ఈ సినిమా మేక‌ర్స్ త్వ‌ర‌లోనే ప్ర‌చార కార్య‌క్ర‌మాలు కూడా స్పీడ‌ప్ చేయ‌నున్నారు. ఈ సినిమాలో ప‌వ‌న్ దేవుడిగా క‌నిపిస్తార‌ని కూడా టాక్ ? ఇక ఈ సినిమా ర‌న్ టైం కూడా లాక్ అయ్యింద‌ట‌. బ్రో ర‌న్ టైం మొత్తం 2 గంట‌ల 10 నిమిషాలు. అంటే మొత్తం 130 నిమిషాల ర‌న్ టైంతో ఈ సినిమా న‌డుస్తుంది.

ఇక ఈ సినిమా స్టార్ట్ అయ్యాక 20 నిమిషాల‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాత్ర ఎంట్రీ ఉంటుంద‌ని తెలుస్తోంది. ఇక ర‌న్ టైం ప‌రంగా చూసుకుంటే సినిమాకు ఖ‌చ్చితంగా బిగ్గెస్ట్ ప్ల‌స్ పాయింట్‌. ఇక విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాకు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో మంచి బ్లాక్‌బ‌స్ట‌ర్ టాక్ అయితే వినిపిస్తోంది.

ఈ టాక్‌కు తోడు ప‌వ‌న్ మానియా ఏ మాత్రం తోడు అయినా కూడా బ్రో సినిమా థియేట‌ర్ల‌లో ఓ ఊపు ఊప‌డం ఖాయం. సంక్రాంతికి వ‌చ్చిన చిరు వాల్తేరు వీర‌య్య సినిమాలో స్పెష‌ల్ సాంగ్‌లో ఆడిపాడిన బాలీవుడ్ భామ ఊర్వశీ రౌతేల స్పెషల్ సాంగ్ చేయ‌గా.. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతాన్ని అందించారు.