ఎన్టీఆర్ సినిమాపై ప్రశాంత్ నీల్ న్యూ అప్‌డేట్‌

సూపర్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ జోరు మీదున్నాడు. “కెజిఎఫ్” దర్శకుడు ప్రస్తుతం ప్రభాస్ ప్రధాన పాత్రలో “సాలార్” సినిమాతో బిజీగా ఉన్నాడు.“సాలార్ ప్రోగ్రెస్‌లో ఉంది. 50 శాతం షూటింగ్‌ పూర్తయింది. విజువల్ ఎఫెక్ట్స్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ కోసం మాకు చాలా సమయం కావాలి. కాబట్టి 2023 మొదటి త్రైమాసికంలో షూటింగ్ మొత్తం పూర్తి చేస్తాం’’ అని ప్రశాంత్ నీల్ తెలిపారు.“సాలార్” సెప్టెంబర్ 28, 2022న థియేటర్లలోకి రానుంది.

అంతేకాకుండా, ఎన్టీఆర్‌తో తన తదుపరి చిత్రం గురించి అప్‌డేట్ ఇచ్చాడు. “ఎన్టీఆర్‌తో నేను ఒక చిత్రానికి సంతకం చేసాను, అది 2023 ఏప్రిల్ లేదా మేలో సెట్స్‌పైకి వెళ్తుంది” అని ఆయన తెలిపారు.దర్శకుడు కొరటాల సినిమా కంటే ప్రశాంత్ నీల్ సినిమాపైనే ఎన్టీఆర్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అందువల్ల, ఫ్యాన్స్ నీల్ అప్డేట్ తో సంబరాలు జరుపుకుంటున్నారు.

Tags: director prasanth neel, jr ntr, NTR 31 Movie, telugu news, tollywood news