బాలీవుడ్‌లో అత్యంత టాలెంటెడ్ యాక్టర్‌గా పేరుగాంచిన నవాజుద్దీన్ సిద్ధిఖీ ఇటీవల కాలంలో చాలా కాంట్రవర్సీలలో చిక్కుకుంటున్నాడు. అతని భార్య దారుణమైన ఆరోపణలు చేయడం మొన్నటిదాకా విన్నాం. అయితే ఇప్పుడు అతను మరొక వివాదంలో పడ్డాడు. నవాజుద్దీన్ ఒక అప్‌కమింగ్ సినిమాలో తన కూతురు వయసున్న నటీమణితో ఘాటైన రొమాన్స్ చేశాడు. ఆమెను లిప్ కిస్సులు చేస్తూ రెచ్చిపోయాడు. ఆ నటి పేరు అవ్నీత్ కౌర్. ఇక ఆ సినిమా పేరు ‘టికు వెడ్స్ షేరు‘.
నిన్ననే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియా యూట్యూబ్ ఛానల్ అధికారికంగా లాంచ్ చేసింది. దాదాపు 2 1/2 నిమిషాల నిడివిగల ఈ ట్రైలర్ లో నవాజుద్దీన్ సిద్ధిఖీ బాగా హైలైట్ అయ్యాడు. ముఖ్యంగా నవాజుద్దీన్, అవ్నీత్ కౌర్ లిప్ లాక్ సీన్ బాగా వైరల్ అవుతోంది. అయితే దీన్ని చూసిన చాలామంది నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
కూతురు కంటే చిన్న వయసున్న అమ్మాయితో ఆ ముద్దులెంది? ఇలాంటి సన్నివేశాలు ఎలా ఒప్పుకుంటారు, మీకు అసలు బుద్ధుందా? అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. “మీకు 49 ఏళ్ల వయసు ఉంది. ఆమెకేమో 21 ఏళ్ల వయసు ఉంది. అంత వయసు ఉంచుకొని చిన్నపిల్లతో ఎలా రొమాన్స్ చేస్తావ్? ” అంటూ మరి కొందరు తీవ్రస్థాయిలో నవాజుద్దీన్‌ని ఏకిపారేస్తున్నారు. ఇక టికు వెడ్స్ షేరు సినిమాని కంగనా రనౌత్ ప్రొడ్యూస్ చేసింది. ఈ మూవీ కథ అనేది ముంబైలో షేరు (నవాజుద్దీన్) కెరీర్ ఎలా మొదలయ్యింది అనేదాని చుట్టూ తిరుగుతుంది.
యాక్టర్‌గా నిలదొక్కుకునేందుకు ఇతను ఎన్ని ఇబ్బందులు పడ్డాడు? అనేది ఈ సినిమా చూపిస్తుంది. ఈ క్రమంలో షేరుకి కనే టికు (అవ్నీత్)తో పరిచయం ఏర్పడుతుంది. ఆమె కూడా నటిగా మారాలని ప్రయత్నాలు చేస్తుంటుంది. అయితే వీరిద్దరి మధ్య కాలక్రమేణా ప్రేమ చిగురిస్తుంది. తర్వాత వారు పెళ్లి చేసుకుంటారు. పెళ్లి అయ్యాక వీరి మధ్య ఏం జరిగింది అనేది కూడా సినిమాలో చాలా ఆసక్తికరంగా చూపించినట్లు తెలుస్తోంది.