Naresh Pavitra : పవిత్ర లోకేష్ కి నరేష్ నెలకు అన్ని లక్షలు ఇస్తున్నాడా..?

సీనియర్ హీరో ప్రస్తుతం క్యారక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్న నరేష్ ఈమధ్య పవిత్ర లోకేష్  (Naresh Pavitra )తో కలిసి ఉంటున్న విషయం తెలిసిందే. ఇద్దరు డైరెక్ట్ గానే మేం సహజీవనం చేస్తున్నామని హింట్ ఇచ్చేశారు. మొన్నామధ్య ఇద్దరు కలిసి హోటల్ రూం లో కనిపించగా నరేష్ 3వ భార్య చేసిన రచ్చ తెలిసిందే. ఇదిలాఉంటే నరేష్ తో పవిత్ర సహజీవనానికి ఓ అగ్రిమెంట్ కూడా చేసుకుందని తెలుస్తుంది.

ఆ అగ్రిమెంట్ ప్రకారమే నరేష్ పవిత్రతో ఉంటున్నారట. పవిత్ర లోకేష్ కి నెలకు 25 లక్షలు ఇచ్చేలా అగ్రిమెంట్ చేసుకున్నారట. అంతేకాదు ఆమెతో విడిపోయే సందర్భంలో 50 కోట్ల దాకా భరణం ఇచ్చేలా కూడా అగ్రిమెంట్ లో రాసుకున్నారట. ఇది ఎంతవరకు వాస్తవం అన్నది తెలియదు కానీ పవిత్ర లోకేష్ కోసం నరేష్ నెలకు పాతిక లక్షలు ఇస్తున్నాడని తెలియడంతో అందరు షాక్ అవుతున్నారు.

అంతేకాదు పవిత్ర కోసం నరేష్ (Naresh Pavitra ) రికమెండేషన్స్ కూడా చేస్తున్నారట. సినిమాల్లో తనకు మాత్రమే కాదు పవిత్రకు ఛాన్స్ ఇవ్వాలని చెబుతున్నారట నరేష్. మొత్తానికి పవిత్ర కోసం నరేష్ బాగానే సమర్పించుకుంటున్నారని నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Tags: Naresh, Naresh Pavitra, Naresh Pavitra Affair, Pavitra Aunty, Pavitra Lokesh, Tollywood