బాల‌య్య బ్లాక్‌బ‌స్ట‌ర్ హీరోయిన్‌ను ఇండ‌స్ట్రీకి దూరం చేసిందెవ‌రు.. ఏం జ‌రిగింది…!

ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన తార‌లు ఆ తర్వాత కాలంలో కనుమరుగైపోవడం ఇండస్ట్రీలో కామన్. కొంతమంది ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతుండగా.. మరి కొంతమంది అవకాశాలు లేకపోవడంతో సినీ ఇండస్ట్రీకి దూరమవుతున్నారు. ఇంకొందరు కొన్ని కొన్ని కారణాల వల్ల దూరమవుతున్నారు. ఆ లిస్టులో ” ప్రీతి జింగానియా “కూడా ఒక హీరోయిన్‌.

ఒకప్పుడు తమ్ముడు, నరసింహనాయుడు, అప్పారావు డ్రైవింగ్ స్కూల్ లాంటి సినిమాలతో ఫిలిం ఇండస్ట్రీలో పాపుల‌ర్ అయ్యింది ప్రితి. ఆ తర్వాత టాలీవుడ్ లో సరిగ్గా అవకాశాలు రాక బాలీవుడ్ లోకి ఎంటర్ అయ్యింది. ఆ తర్వాత తేజ సినిమాలో ఐటమ్ సాంగ్ చేసింది. 2007లో వచ్చిన విక్టోరియా నెం.203 సినిమా తర్వాత ఆమె మ‌రే చిత్రంలోని కనిపించలేదు. బాలీవుడ్ కు గుడ్ బై చెప్పిన ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.

దీనిలో భాగంగా ఫాస్‌ వెబ్‌ సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చింది. తను సినిమాలకు దూరం అవడానికి కారణం ఏంటన్న విష‌యం తెలిపింది. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ నేను కోరుకున్న పాత్రలు నాకు దొరకలేదు.. నాకు వచ్చిన పాత్రలు చేయడానికి నా మనసు అంగీకరించలేదు.. నాకు సినిమాల్లో కీలక పాత్రలు చేయాలని ఉండేది అందుకే సినిమాల‌కు దూర‌మ‌య్యాన‌ని చెప్పింది.

ఇక సినిమాల్లో నేనొక్కదాన్నే హైలెట్ అవ్వాలని చెప్పడం లేదు. కనీసం నా పాత్రకు ప్రాముఖ్యత ఎక్కువగా ఉండేటట్టు ఉంటే చాలు.. అదే నేను కోరుకునేద‌ని చెప్పుకొచ్చింది. అటువంటి పాత్రలు నాకు రావడం లేద‌నే ఒక అడుగు వెనక్కి వేశానంటూ చెప్పుకొచ్చింది. కానీ బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ఛాన్సులు మిస్ అయ్యాను.. కానీ నా లైఫ్ లో నేను హ్యాపీగానే ఉన్నాను అంటూ తెలియజేసింది.