యంగ్ హీరో నాగశౌర్య సాధారణంగా కాంట్రవర్సీలకు దూరంగా తన పని తాను చేసుకుపోతూ ఉంటాడు. ఇటీవల నాగశౌర్య వరుస పెట్టి సినిమాలు చేస్తున్నా అవి సక్సెస్ కావడం లేదు. తాజాగా నాగశౌర్య నటించిన సినిమా రంగబలి. నిన్న రిలీజ్ అయిన ఈ ట్రైలర్‌కు అప్లాజ్ రెస్పాన్స్ వస్తోంది. ఇక కొద్ది రోజుల క్రితం నాగశౌర్యకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.
రోడ్డుపై గొడవ పడుతున్న ఓ జంటను ఆపిన నాగశౌర్య వాళ్ల సమస్య తెలుసుకుని… ఆ అబ్బాయికి బుద్ధి చెప్పాడనే అందరూ అనుకున్నారు. అయితే అక్కడ జరిగింది వేరే అట. ఈ విషయాన్ని తాజాగా నాగశౌర్య బయట పెట్టాడు. ఆ రోజు జరిగిన సంఘటనలో అబ్బాయిని తను కొట్టలేదని చెప్పాడు. అతడ్ని మందలిస్తుంటే, అతడి పక్కనే ఉన్న అమ్మాయి తనకే రివర్స్ లో షాక్ ఇచ్చిందని చెప్పాడు.
ఆ రోజు తాను కారులో వెళుతున్నాను… హైదరాబాద్ కూకట్ పల్లి మెయిన్ రోడ్డు మీద ఓ అమ్మాయిని, ఓ అబ్బాయి కొడుతున్నాడని.. అది చూసి కారు దిగిన నేను ఆ అమ్మాయిని ఎందుకు కొడుతున్నావని అడగడంతో పాటు సీరియస్ అయ్యాడట. వెంటనే ఆ అబ్బాయి కంటే ఆ అమ్మాయి రియాక్ట్ అయ్యిందట. నా బాయ్ ఫ్రెండ్ నన్ను కొడతాడు.. లేకుంటే చంపుతాడు.. నువ్వు మధ్యలో ఎందుకు ? ఎంటర్ అవుతావని శౌర్యకే రివర్స్ షాక్ ఇచ్చిందట.
వాస్తవానికి తాను ఆ అమ్మాయికి రక్షణగా పోలీస్ కంప్లైట్ ఇవ్వాలనుకున్నానని.. అయితే ఆ అమ్మాయే అలా మాట్లాడేసరికి తనకు పెద్ద షాక్ తగిలిందన్నాడు. ఆ రోజు తనకు ఎదురైన అనుభవంలో కొట్టిన అబ్బాయిది తప్పులేదని.. కొట్టించుకున్న అమ్మాయిదే అని చెప్పాడు.
ఇక అమ్మాయిలు కొట్టే అబ్బాయిల్ని అస్సలు ప్రేమించవద్దు… పెళ్లి చేసుకోవద్దు.. అది ఆ అమ్మాయిల కుటుంబాలకు, అమ్మాయిలకు అస్సలు మంచిది కాదని తన అభిప్రాయం చెప్పేశాడు. ఇక అమ్మాయిలు ప్రేమగా ఉండేవాడ్ని పెళ్లి చేసుకోండి. కొట్టేవాడు, తిట్టేవాడితో ఉండొద్దని విజ్ఞప్తి చేశాడు.