భ‌ర్తతో విడాకులపై ఎట్ట‌కేల‌కు నోరు విప్పిన ఆశిన్.. క్లారిటీ వ‌చ్చేసింది…!

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన మలయాళ ముద్దుగుమ్మ ఆశిన్ గురించి గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది. ఆమె తన భర్తకు విడాకులు ఇవ్వడానికి రెడీగా ఉందంటూ ప‌లు వార్తలు జోరుగా వినిపించాయి. 2016లో ప్రముఖ వ్యాపారవత మైక్రోమ్యాక్స్ సీఈవో రాహుల్ శర్మను ఆసిన్ పెళ్లి చేసుకుంది.
ఓ యాడ్ షూటింగ్ స‌మ‌యంలో వీరిద్ద‌రు క‌లుసుకున్నారు. ఆ త‌ర్వాత స్నేహితులుగా మార‌గా… ఆ త‌ర్వాత ప్రేమికులు అయ్యి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఆశిన్.. తన ఫ్యామిలీ లైఫ్ లో ఎంతో బిజీగా గడుపుతుంది. అంతేకాకుండా ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇక తన భర్త పాపతో కలిసి తన ఫ్యామిలీ లైఫ్ ఎంతో ఎంజాయ్ చేస్తుంది.
ఇప్పుడు ఎవరు ఊహించని విధంగా ఆశిన్, ఆమె భర్త మధ్య మనస్పర్ధలు వచ్చాయని.. అవి పెరిగి పెరిగి విడాకులు వరకు దారితీసింది అని వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా ఆ వార్తలపై ఆశిన్ స్పందించింది.. విడాకులపై ఎవరూ ఊహించిని విధంగా క్లారిటీ ఇచ్చింది. ” ప్రస్తుతం నేను నా భర్తతో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాను.. ఇప్పుడే ఇద్దరం ఒకరికి ఎదురుగా ఒకరు కూర్చుని బ్రేక్ఫాస్ట్ కూడా చేస్తు ఈ వార్తను చూసాం”. ”వాటిలో అసలు నిజం లేదని కొట్టి ప‌డేసింది.
మా పెళ్లి టైం లో కూడా మేము బ్రేకప్ చెప్పుకున్నామని పలు వార్తలు వచ్చాయి. ఇలాంటి ఫేక్ వార్తలు రాయటం ఇక‌నైనా ఆపండి అంటూ ఆశిన్ తన సోషల్ మీడియాలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఇక దీంతో ఆశిన్ విడాకుల గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదని తేలిపోయింది.