Naga Chaitanya : సమంతపై నా ఫీలింగ్ ఇదేనంటూ హాట్ కామెంట్స్ చేసిన చైతు..!

కొన్నేళ్లపాటు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు నాగచైతన్య(Naga Chaitanya), సమంత. వీరిద్దరి అన్యోన్య దాంపత్యాన్ని చూసి అందరూ మురిసిపోయేవారు. అయితే వారిద్దరి మధ్య ఉన్నట్టుండి ఏం జరిగిందో తెలియదు. వాళ్ల కాపురంలో చిచ్చు రేగింది. ఇద్దరూ విడాకులు ప్రకటించారు. సమంత, నాగచైతన్య విడాకులు తీసుకున్న తర్వాత వారిద్దరి విషయంలో తప్పంతా సమంతదే అన్నట్టు సోషల్ మీడియా వేదికగా విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. ఆ తర్వాత వీటికి సమంత దీటైన జవాబు ఇచ్చింది. అయితే సమంత, నాగచైతన్య విడిపోయి కొన్ని నెలలు గడుస్తున్నప్పటికీ వారిద్దరూ ఎందుకు విడాకులు తీసుకున్నారన్న విషయమై అసలు విషయం బయటకు రాలేదు. దీనిపై నాగచైతన్యకు, సమంతకు తరచూ ఈ ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

మీడియా సమావేశాల్లో, ఇంటర్వ్యూల్లో, సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ వారిద్దరి ఎదుట పదేపదే విడాకుల విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. దీంతో నాగచైతన్య, సమంత ఈ విషయమై అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటికి మొన్న బాలీవుడ్ లో దర్శక నిర్మాత కరణ్ నిర్వహిస్తున్న కాఫీ విత్ కరణ్ షోలో సమంత వద్ద నాగచైతన్య ప్రస్తావన వచ్చింది. అలాగే ప్రస్తుతం నాగ చైతన్య లాల్ సింగ్ చడ్డా అనే హిందీ మూవీ లో నటిస్తున్నాడు. ఈ మూవీ ప్రమోషన్స్ కు హాజరవుతున్న నాగచైతన్యకు పదే పదే మీడియా నుంచి సమంత కు సంబంధించిన విషయాల గురించి ప్రశ్నలు వస్తున్నాయి.

విడాకుల తర్వాత మీరిద్దరూ ఎప్పుడూ వార్తల్లో ఉంటున్నారని ఓ వ్యక్తి ఇంటర్వ్యూలో నాగచైతన్య(Naga Chaitanya) ను ప్రశ్నించగా ఆయన అసహనం వ్యక్తం చేశారు. ‘ సమంత అంటే ఇప్పటికీ నాకు ఎంతో గౌరవం ఉంది. మేం ఇద్దరం ఇప్పటికే విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించాం. మా మధ్య ఏం జరిగిందో కూడా వివరించాం.మా గురించి చెప్పడానికి కూడా ఇక ఏమీ లేదు.మా మధ్య ఏం జరిగిందో తెలుసుకోవాలని ప్రజలు అనుకుంటున్నారు. అందుకే ఈ విషయమై తరచూ ప్రశ్నలు వస్తున్నాయి. విడాకుల గురించి తెలియజేసి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఇదే ప్రశ్నలు ఎదురవుతుండటం విసుగు తెస్తోంది. ఎప్పుడూ అవే మాటలు విని విని బోర్ కొడుతోంది. సమంతా, నేను విడిపోయి ఉండవచ్చు. కానీ ఆమెపై ఎప్పటికీ గౌరవం పోదు’ అని నాగచైతన్య కామెంట్స్

Tags: Naga Chaitanya, Samantha, tollywood gossips