నాగ చైతన్య ‘కస్టడీ’ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రిలీజ్

హీరో నాగ చైతన్య ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో ద్విభాషా ‘కస్టడీ’ చిత్రంలో కృతి శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ ద్విభాషా చిత్రాన్ని నిర్మిస్తుండగా, పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. ప్రీ లుక్‌తో మేకర్స్ అందరినీ ఆశ్చర్యపరిచారు.ఈరోజు నాగ చైతన్య పుట్టినరోజున ఈ చిత్రంకు సంభందించిన అద్భుతమైన ఫస్ట్ లుక్ మరియు పవర్ ఫుల్ టైటిల్‌ను రివీల్ చేయడం ద్వారా మేకర్స్ సినిమాపై బజ్ క్రియేట్ చేశారు. వెంకట్ ప్రభు చైతన్యని పూర్తిగా కొత్త అవతార్‌లో చూపించడంతో అది అందరిని ఆకట్టుకునే విధంగా ఉన్నది .

కస్టడీకి ట్యాగ్‌లైన్ ‘ఎ వెంకట్ ప్రభు వేట’. ఈ చిత్రంలో నాగ చైతన్య “ఎ.శివ” అనే పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా సొంత శాఖపైనే ఆయన పోరాడుతున్నట్లు తెలుస్తోంది.మాస్ట్రో ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ప్రియమణి పవర్ ఫుల్ పాత్రలో నటిస్తుండగా అరవింద్ స్వామి విలన్ పాత్రలో నటిస్తున్నారు.

Tags: Akkineni Naga Chaitanya, director Venkat Prabhu, Krithi Shetty, Naga Chaitanya Custody movie, Srinivasaa Silver Screen banner, telugu news, tollywood news