బాలీవుడ్ స్టార్ హీరో సినిమా నాలుగు రోజులకే షోస్ రద్దు!

భారీ అంచనాలతో వస్తున్న పెద్ద సినిమాకి షోలు రద్దు కావడం నిజంగా షాకింగ్ విషయం.రణబీర్ కపూర్ నటించిన “షంషేరా”చాలా మంది భారతీయ ప్రేక్షకులను ఎదురు చూసేలా చేసిన చిత్రం.అయితే రిలీజ్ ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్ చూస్తే మాత్రం చాలా దారుణంగా ఉంది.థియేటర్లులో టికెట్లు ఆడియన్సు బుక్ చేయకపోవడంతో చాలా చోట్ల నాలుగోవ రోజు షోలు రద్దయ్యాయి.దీన్నిబట్టే చెప్పొచ్చు ఈ సినిమా ఎంతగా డిజాస్టర్‌గా నిలిచిందని . ఈ చిత్రంలో వాణి కపూర్ మరియు సంజయ్ దత్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.

మొదటి రోజు రూ. 10.24 కోట్ల కలెక్షన్లతో ప్రారంభమైన ఈ సినిమా లైఫ్ టైమ్ కలెక్షన్ రూ. 50- రూ. 60 కోట్ల మధ్య ఉండవచ్చని ట్రేడ్ నిపుణుల అభిప్రాయం. సోమవారం నాడు కలెక్షన్లలో భారీగా 70% డ్రాప్ అయ్యి దేశవ్యాప్తంగా రూ.4 కోట్లు రాబట్టింది.ఫిలిం మేకింగ్ మరియు ప్రచారానికి సంబంధించిన ఖర్చులను పరిగణనలోకి తీసుకుంటే, ఈ కలెక్షన్స్ ఏ రూపేనా సినిమా యొక్క భారీ నష్టాన్ని పూడ్చలేనందున, ఈ సినిమా బాలీవుడ్ లో ఘోరమైన డిజాస్టర్ సినిమాల జాబితాలో చేరింది.

Tags: bollywood news, Ranbir Kapoor, sanjay dutt, shamshera movie, vaani kapoor