మెగా ప్రిన్సెస్ ‘ క్లీంకార ‘ కోసం స్పెష‌ల్ రూమ్‌.. సూప‌ర్ ఉంది ( వీడియో)

మెగా కోడ‌లు రామ్‌చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న ఇటీవ‌ల పండండి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన సంగ‌తి తెలిసిందే. పెళ్ల‌య్యాక 12 ఏళ్ల పాటు ఊరించి ఊరించి వ‌స్తూ ఎట్ట‌కేల‌కు రామ్‌చ‌ర‌ణ్ – ఉపాస‌న దంప‌తులు త‌ల్లిదండ్రులు అయ్యారు. ఈ 12 ఏళ్ల‌లో చిరంజీవికి కూడా ఎప్పుడు మీ కొడుకు, కోడ‌లు త‌ల్లిదండ్రులు కాబోతున్నారంటూ చాలా ప్ర‌శ్న‌లే ఎదుర‌య్యాయి. అయితే చిరు మాత్రం వారి ఇష్టానికే తాను వ‌దిలేశానంటూ సింపుల్‌గా ఆన్స‌ర్ చేస్తూ వ‌చ్చేవారు.

అయితే ఎట్ట‌కేల‌కు ఉపాస‌న ప్రెగ్నెంట్ అవ్వడంతో పాటు ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. ఇక ఉపాస‌న‌కు అపోలో హాస్ప‌ట‌ల్లో డెలివ‌రీ చేసేందుకు దేశ‌వ్యాప్తంగా ఉన్న టాప్ గైన‌కాల‌జిస్టుల‌తో పాటు టాప్ పీడియాట్రిక్ స్పెష‌లిస్టుల‌ను కూడా ప్ర‌త్యేక ఫ్లైట్ల‌లో హైద‌రాబాద్‌కు తీసుకువ‌చ్చారు. అస‌లు ఈ డెలివ‌రీ అనేది క‌నివినీ ఎరుగ‌ని రేంజ్‌లో చేశార‌నే చెప్పాలి.

ఇక ఈ బిడ్డ‌కు క్లీం కార అనే నామ‌క‌ర‌ణం కూడా చేశారు. అస‌లు ఈ బార‌సాల కార్య‌క్ర‌మాన్ని ఎంతో గ్రాండ్‌గా నిర్వ‌హించారు. త‌న ముద్దుల త‌న‌య విష‌యంలో ఉపాస‌న ఎంతో శ్ర‌ద్ధ తీసుకుంటున్నారు. కుమార్తె చుట్టూ అహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణం ఉండేలా ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే క్లీంకార‌ కోసం ప్ర‌ముఖ ఆర్కిటెక్ ప‌విత్రా రాజారామ్ ఆధ్వ‌ర్యంలో ఓ స్పెష‌ల్ రూమ్ డిజైన్ చేశారు.

ఆమ్రాబాద్ ఫారెస్ట్‌, వేదిక్ హీలింగ్ అంశాల‌ను ప్రేర‌ణగా తీసుకుని.. ఈ ఇంటీరియ‌ర్ డిజైన్ రెడీ చేశార‌ట‌. ఈ వీడియోను ట్విట్ట‌ర్‌లో షేర్ చేయ‌గా… లైకులు, కామెంట్ల వ‌ర్షం కురుస్తోంది. తాను త‌న కుమార్తెను మంచి వాతావ‌ర‌ణంలో పెంచేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు ఉపాస‌న పేర్కొంది.