ప‌దే ప‌దే మెగా హీరోలు నానిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు… తొక్కేసే ప్లానా…!

నేచురల్ స్టార్ నాని దసరా సినిమాతో ఈ ఏడాది సూప‌ర్ హిట్ కొట్టాడు. కెరీర్‌లో మొదటిసారి 100 కోట్ల బాక్సాఫీస్ మార్కెట్ రుచి చూశాడు. ఈ క్ర‌మంలోనే ఈ సారి నాని ఒక రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. నాని 30వ సినిమాను కొత్త డైరెక్టర్ శౌర్యువ్ తెరకెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సినిమా కంటెంట్‌పై నాని పూర్తిస్థాయి న‌మ్మ‌కంతో ఉన్న‌ట్టు తెలుస్తోంది.

ఈ సినిమాను డిసెంబ‌ర్ 21న రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే అదే టైంకు ఇద్ద‌రు మెగా హీరోలు న‌టిస్తోన్న సినిమాలు కూడా రిలీజ్ చేసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓజీ సినిమాతో పాటు మ‌రో మెగా హీరో సినిమా కూడా అదే డేట్‌కు వ‌చ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఇద్ద‌రు మెగా హీరోల సినిమాల మ‌ధ్య‌లో నాని సినిమా వ‌చ్చిందంటే సినిమాకు ఎంత హిట్ టాక్ ఉన్నా ఖ‌చ్చితంగా వ‌సూళ్ల‌పై గ‌ట్టిఎఫెక్ట్ ప‌డుతుంది.

ఇక మెగా ఫ్యామిలీ, ఆ కాంపౌండ్ ఎందుకో నానిని ముందు నుంచి టార్గెట్ చేస్తుంద‌న్న గుస‌గుస‌లు ఇండ‌స్ట్రీలో ఉన్నాయి. నాని సినిమా వ‌స్తుందంటే చాలు ఆ సినిమాకు పోటీగా త‌మ హీరోల సినిమాల‌ను రిలీజ్‌చేయ‌డం… లేక‌పోతే నాని సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు వారం రోజుల ముందు నుంచే సోష‌ల్ మీడియాలో ఓ నెగ‌టివ్ టాక్ అయితే బాగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది.

ఇక సినిమా కంటెంట్ ఎంత బాగున్నా కూడా నెగ‌టివ్ టాక్‌ను కొన్ని సోష‌ల్ మీడియా ఖాతాలు బాగా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. నాని గ‌త ఏడెనిమిది సినిమాలు చూస్తే కంటెంట్ ప‌రంగా, న‌ట‌న‌ప‌రంగా అన్ని బాగుంటాయి. కానీ రిజ‌ల్ట్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేస‌రికి ఏదో తేడా కొట్టిన‌ట్టు ఉంటుంది. కావాల‌నే సోష‌ల్ మీడియాలో మెగా కాంపౌండ్ వాళ్లు, వారి అనుచ‌రులు నాని సినిమాల‌ను ప‌నిగ‌ట్టుకుని టార్గెట్ చేస్తున్నార‌న్న ప్ర‌చారం అయితే ఉంది.

ఇక ఇప్పుడు ద‌స‌రాతో పాన్ ఇండియా రేంజ్‌లో హిట్ కొట్టిన నానికి మంచి క్రేజ్ ఉంది. ఇలాంటి టైంలో నాని నెక్ట్స్ సినిమాకు పోటీగా మెగా హీరోల సినిమాలు ఒకేసారి దండ‌యాత్ర‌కు దిగుతున్నాయంటే మ‌ళ్లీ నానిని మెగా కాంపౌండ్ టార్గెట్ చేస్తోన్న ప‌రిస్థితే ఉంది. అయితే నాని వాళ్ల సినిమాల‌తో పోటీకి దిగ‌డం.. లేదంటే త‌న సినిమాను వాయిదా వేసుకోవ‌డం చేయాలి.