దాని పై క్లారిటీ ఇచ్చేసిన మ‌హేష్ బాబు….

సూప‌ర్ స్టార్‌ మహేష్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు.  అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనరవి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. రష్మిక మందన హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంను దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్, ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు.  ఈ చిత్రంలో ముఖ్య ఆక‌ర్ష‌ణ‌ లేడీ అమితాబ్‌ విజయశాంతి కీలకపాత్రలో కనిపించబోతున్నారు. ఇక విడుద‌ల తేది ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో చిత్ర‌యూనిట్ విసృతంగా ప్ర‌యోషన్స్ జ‌రుపుతుంది.

ఇదిలా ఉంటే.. సూపర్ స్టార్ మహేష్ బాబు తన తరువాత సినిమాని కూడా ఇప్పటికే లైన్ లో పెట్టారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ బాబు తన తరువాత సినిమాని దర్శకుడు వంశీ పైడిపల్లితో చెయ్యబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేశాడు.  సరిలేరు నీకెవ్వరు సినిమాను కేవలం ఆరు నెలల్లోనే పూర్తి చేసిన మహేష్‌, తదుపరి చిత్రం ప్రారంభించేందుకు లాంగ్ గ్యాప్ తీసుకుంటాడ‌ట‌. ఈ క్ర‌మంలోనే మూడు నెలలు గ్యాప్ తీసికుని.. ఆ తర్వాత నుండి వంశీ పైడిపల్లితో సినిమాని స్టార్ట్ చేస్తానని మహేష్ చెప్పాడు.

ఇక ఇప్పటికే వంశీ పైడిపల్లి స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలుపెట్టాడట. ఆల్ రెడీ వంశీ, మహేష్ కి లైన్ చెప్పాడట. కాగా, వీరిద్ద‌రి కాంబోలో వ‌చ్చిన ‘మహర్షి’ సూప‌ర్ డూప‌ర్ హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. నిజానికి మహర్షి చిత్రం మహేష్ బాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. పైగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం కొన్ని చోట్ల నాన్ బాహుబలి రికార్డు ను కూడా బ్రేక్ చేసింది. అయితే తిరిగి మ‌ళ్లీ వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లోనే మ‌రో సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డం ఖాయం అయింది. ఇక ప్ర‌స్తుతం మ‌హేష్‌ స‌రిలేరు సినిమా ప్ర‌మోష‌న్స్‌లో బిజిగా ఉన్నాడు.

Tags: MaheshBabu, Tollywood, Vamsi Paidipally