మహేష్ బాబు ‘SSMB 28 ‘ న్యూ అప్డేట్ న్యూస్

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ చిత్రానికి వర్కింగ్ టైటిల్ ‘SSMB 28 ‘ అని పేరు పెట్టారు.ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఇప్పటికే పూర్తయింది.
ఇప్పటి వరకు వచ్చిన అవుట్‌పుట్‌పై మహేష్ అసంతృప్తిగా ఉండటంతో సినిమా ఆగిపోయిందని పలు మీడియా పోర్టల్స్లో న్యూస్ వైరల్ అవుతున్నాయి.

అయితే నిర్మాత నాగ వంశీ ఇటువంటి నిరాధారమైన పుకార్లను నమ్మొద్దు అంటూ ఈ రోజు ఒక ట్వీట్ చేస్తూ “మా మోస్ట్ ఎవెయిటింగ్ యాక్షన్ ఎక్స్‌ట్రావాగాంజా SSMB 28 రెండవ షెడ్యూల్ త్వరలో ప్రారంభమవుతుంది. రాబోయే రోజుల్లో మరిన్ని అప్‌డేట్‌లు వస్తాయి చూస్తూ ఉండండి!” అని ట్వీట్ చేసారు .ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయిక. హారిక హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా,థమన్ సంగీత అందిస్తున్నాడు .

Tags: director trivikram, mahesh trivikram, MaheshBabu, SSMB28 Title