సమంత గ్యారేజ్‌లో లగ్జరీ కార్లు ఇంత స్పెష‌లా…!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నాగచైతన్య హీరోగా వచ్చిన ఏం మాయ చేసావే సినిమాతో హీరోయిన్‌గా అడుగుపెట్టింది. తర్వాత 2021 చివ‌ర్లో వచ్చిన పుష్ప సినిమాలో ఊ అంటావా మామ.. ఉ ఊ అంటావా మామ.. అంటూ అన్ని తరాల ప్రేక్షకులను ఉర్రూతలూ ఊగించింది. ప్రస్తుతం సామ్‌ తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోయిన్‌గా కొనసాగుతోంది.

Samantha Ruth Prabh news: Samantha Ruth Prabhu walks out of Bollywood  films; Is the actor going on long break? Read here - The Economic Times

సమంత తన కెరీర్ ఫుల్ జోష్‌లో ఉన్న సమయంలోనే తన మొదటి సినిమా హీరో నాగచైతన్యతో ప్రేమలో పడి ఏడు అడుగులు వేసింది. కానీ ఈ వీరి బంధం ఎంతోకాలం సాగలేదు. కేవలం నాలుగు సంవత్సరాలకే విడాకులు తీసుకున్నారు. నాగచైతన్యతో విడాకుల‌ తర్వాత సమంత వరుస‌ సినిమాలతో తన కెరీర్ మరింత స్పీడ్ పెంచింది.

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు వరుస‌ ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకుపోతుంది. అదే సమయంలో వెబ్ సిరీస్‌లతో పాటు ఎన్నో బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటూ కోట్లకు కోట్లు సంపాదిస్తుంది. హీరోయిన్ గానే కాకుండా బిజినెస్ వుమెన్‌గా కూడా తన సత్తా చాటుకుంటోంది. ఇక ఇప్పుడు సమంతా లగ్జరీ లైఫ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

Technology Is About to Transform the Luxury Car. Here's How – Robb Report

ఇప్పటికే ఎన్నో కోట్లు సంపాదించిన ఈ ముద్దుగుమ్మ.. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఎంతో ఖరీదైన వస్తువులను వాడ‌డం, కొన‌డంతో సోషల్ మీడియాలో ఎప్పుడూ హైలెట్గా నిలుస్తూ వస్తుంది. సమంతకు ఖరీదైన కార్లు అంటే ఎంతో ఇష్టమట.. ఆ ఇష్టంతోనే ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు తన గ్యారేజ్ లో ఐదు లగ్జరీ కార్ల‌ల‌ను కొనుగోలు చేసిందట. వాటి ధర తెలిస్తే ప్రతి ఒక్కరికి దిమ్మ తిరిగి పోవాల్సిందే.

Wallpaper ID: 44069 / Bentley EXP 100 GT, luxury cars, 4K free download

సమంత గ్యారేజ్ లో ఉన్న అత్యంత ఖరీదైన కారులో రేంజ్ రోవర్ ఒకటి. ఎవరు ఊహించని ఫీచర్లతో అత్యంత విలాసంగా ఉండే ఈ కారు విలువ రూ.2.26 కోట్లు. అలాగే సమంత దగ్గర స్వాంకీ పోర్చే కేమ‌న్ అనే మరో లగ్జరీ కారు ఉంది. దీని ప్రైస్ ఏకంగా రూ.1.46 కోట్లు. అంతేకాకుండా రూ.1.42 కోట్లు ఖ‌రీదు చేసే మెర్సిడీస్ బెంజ్ కారు, రూ. రూ.83 ల‌క్ష‌లు విలువైన ఆడి క్యూ 7 కారుతో పాటు రూ.72 ల‌క్ష‌ల జాగ్వార్ ఎక్స్ ఎఫ్ వంటి ల‌గ్జ‌రీ కార్లు సమంత గ్యారేజ్‌లో ఉన్నాయి.

Samantha Ruth Prabhu to head to South Korea for advanced Myositis treatment  | Telugu Movie News - Times of India