చిరు ‘మెగా 150 ‘ లో రవితేజ పాత్రపై తాజా అప్‌డేట్!

మెగా స్టార్ చిరంజీవి నెక్స్ట్ సినిమా మెగా 154 వర్కింగ్ టైటిల్ తో పిలవబడే చిరంజీవి రాబోయే చిత్రంలో మాస్ మహారాజా రవితేజ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాకి కెఎస్ రవీంద్ర (బాబీ) దర్శకుడు.

ఈ సినిమాలో రవితేజ పాత్ర పేరు వైజాగ్ రంగారావు, ఔట్ అండ్ అవుట్ మాస్ పోలీస్ అని తాజా సంచలనం వార్త వైరల్ అవుతుంది . మరి అంతేకాకుండా ఈ సినిమాలో చిరంజీవి రవితేజకు సోదరుడిగా వాల్టేర్ వీరయ్య అనే క్యారెక్టర్ లో నటిస్తున్నాడంట. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుండి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఈ సినిమాలో శ్రుతి హాసన్ కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

Tags: chiranjeevi, Mega 154 movie, Ravi Teja, tollywood news