‘ఎన్టీఆర్ ౩౦’ తాజా అప్‌డేట్ వచ్చేసింది !

అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఎన్టీఆర్ 30. ఈ చిత్రం ఇంకా షూటింగ్ ప్రారంభం కాలేదు కానీ కొరటాల శివ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ల కోసం ఎన్టీఆర్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తాజా అప్‌డేట్ ప్రకారం దర్శకుడు శివతో పాటు అతని బృందం ప్రస్తుతం చిత్రం కోసం లొకేషన్ వేటలో ఉన్నారు. స్టోరీ లైన్ నీటి ఆధారితమైన ప్రాజెక్ట్ కాబట్టి, భారీ వాటర్ ఫైట్ ఎపిసోడ్‌తో షూట్ ప్రారంభించాలని భావిస్తున్నారు.అందుకే ఈ సన్నివేశాల చిత్రీకరణ కోసం చిత్రబృందం లొకేల్‌లను వెతికే పనిలో నిమగ్నమై ఉంది. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని అప్‌డేట్‌ల కొన్ని రోజు వేచి చూడాల్సిందే .

Tags: jr ntr, koratala shiva, NTR 30 Movie, telugu gossips, telugu news, tollywood news