కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తదుపరి చిత్రం వరిసు/ వారసుడు. టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ద్విభాషా చిత్రంలో బబ్లీ బ్యూటీ రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది.
తాజా సమాచారం ఏమిటంటే, స్టార్ నటుడు తన కొత్త సినిమా సెట్స్‌లో జాయిన్ అవ్వడానికి వైజాగ్ చేరుకున్నాడు.విజయ్ వైజాగ్‌కు వెళ్లే ముందు విమానాశ్రయం వద్ద క్యూలో నిలబడి ఉన్న ఫోటో కొద్దిసేపటిలోనే వైరల్‌గా మారింది. ఈరోజు కొత్త షెడ్యూల్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. షెడ్యూల్ గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
శరత్‌కుమార్, జయసుధ, ప్రకాష్ రాజ్, ప్రభు, యోగి బాబు, శ్రీకాంత్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై భారీ స్థాయిలో నిర్మించిన ఈ తెలుగు-తమిళ చిత్రానికి థమన్ సంగీతం అందించారు. ఈ సినిమా 2023 సంక్రాంతికి విడుదల కానుంది.